18th Lok Sabha Session 2024: PM Modi Takes Oath & Telugu States MPs takes
Oath as Lok Sabha Members
18వ
లోక్‌సభ సమావేశాలు 2024: మోదీ & తెలుగు రాష్ట్రాల ఎంపీలు
లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం
=====================
భారత దేశ 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. నేటి ఉదయం
11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి
మహతాబ్.. సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్ సభ పక్ష నేతగా
ప్రధాని మోదీ తొలుత ఎంపీగా ప్రమాణస్వీకారం
చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్ లోక్సభ సభ్యులుగా ప్రమాణం
చేయిస్తున్నారు.
ఈసందర్భంగా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో
ప్రమాణం చేయడం విశేషం. తొలుత ఎన్డీయే మంత్రివర్గంలోని కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి
(భాజపా),
కింజరాపు రామ్మోహన్ నాయుడు (తెదేపా), పెమ్మసాని చంద్రశేఖర్ (తెదేపా), బండి సంజయ్ (భాజపా), భూపతిరాజు
శ్రీనివాసవర్మ (భాజపా) తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిమండలి సభ్యుల
ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు
ప్రమాణం చేశారు.
తొలుత ఏపీ
ఎంపీల (Andhra
Pradesh MPs)కు అవకాశం రాగా.. అందులోనూ కొందరు
ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. వీరిలో మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి
పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్ (చిన్ని), లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. మిగతావారు హిందీ, ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. ఇక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెదేపా ఎంపీ అప్పలనాయుడు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో తొలిరోజు
సభకు హాజరయ్యారు.
=====================
=====================
0 Komentar