41 Years for India's First Cricket World Cup – Check
the Details and Highlights Here
భారత్ మొదటి
క్రికెట్ వరల్డ్‌కప్‌కి 41 ఏళ్లు – ఫైనల్ మ్యాచ్ విశేషాలు ఇవే
=====================
ఇండియా జట్టు
మొదటి వరల్డ్ కప్ గెలిచి నేటికి (జూన్ 25) సరిగ్గా 41 ఏళ్లు. 1983 వరల్డ్ కప్ లో సాదారణంగా బరిలోకి దిగిన కపిల్‌దేవ్
సారధ్యం లోని భారత్ జట్టు అంచనాలకి మించి రాణించి.. విశ్వవిజేతగా నిలిచింది.
అప్పట్లో అగ్రశ్రేణి జట్టుగా ఉన్న వెస్టిండీస్‌ని ఫైనల్లో 43 పరుగుల తేడాతో ఓడించిన భారత్ జట్టులో అప్పుడు కనీసం ఒక్కరు
కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. అయినప్పటికీ.. సమష్టి పోరాటంతో వరల్డ్‌కప్‌ని
భారత్ ముద్దాడింది.
ఫైనల్ మ్యాచ్‌లో
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 54.5 ఓవర్లలో 183 పరుగులకి ఆలౌటైంది. ఓపెనర్లు సునీల్
గవాస్కర్ (2: 12 బంతుల్లో), క్రిస్ శ్రీకాంత్ (38: 57 బంతుల్లో 7x4, 1x6)తో పాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు
మహీందర్ అమరనాథ్ (26: 80 బంతుల్లో 3x4), యశ్‌పాల్ శర్మ (11: 32 బంతుల్లో 1x4), సందీప్ పాటిల్ (27: 29 బంతుల్లో 1x6), కపిల్ దేవ్ (15: 8 బంతుల్లో 3x4) విలువైన పరుగులు చేశారు.
సూపర్ ఫామ్‌లో
ఉన్న వెస్టిండీస్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించేస్తుందని అంతా ఊహించారు. కానీ.. 52 ఓవర్లలో 140 పరుగులకే ఆ జట్టు
ఆలౌటైంది. సర్ వివ్ రిచర్డ్స్ (33: 28 బంతుల్లో 7x4) టాప్ స్కోరర్‌గా నిలవగా.. భారత బౌలర్లలో మదన్‌లాల్, మహీందర్ అమరనాథ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అలానే
బల్విందర్ రెండు, రోజర్ బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ తీశారు. మదన్‌లాల్ బౌలింగ్‌లో
వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ని కపిల్‌దేవ్ పట్టడం మ్యాచ్‌లో
కీలక మలుపు. జూన్ 25,1983న లార్డ్స్ వేదికగా
ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది.
=====================
WATCH
1983 MOVIE (HOT STAR)
WATCH 1983 MOVIE
(NETFLIX)
=====================
0 Komentar