AP Cabinet Meeting
Highlights – 24/06/2024
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 24/06/2024
Cabinet Decisions - Press Briefing by
Hon'ble Minister for I&PR, Housing at Publicity Cell
LIVE - ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి "I &PR శాఖ
మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=jB9OPkFTNYo
=====================
ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం
తెలిపింది.
ఏపీ కేబినెట్
కీలక నిర్ణయాలు ఇవే:
ఎన్నికల్లో
ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
1. మెగా
డీఎస్సీ:
16,347 పోస్టుల భర్తీ కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు.
డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు క్యాబినెట్ ముందుంచారు. జులై
ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు.
2. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు కి మంత్రి వర్గం ఆమోదం.
3. సామాజిక
పింఛన్ల పెంపు:
పింఛన్ల
పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే
నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన
పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత
మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు.
4. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కి మంత్రి వర్గం ఆమోదం. ఆగస్టు నెలలో ప్రారంభం అవ్వనున్నట్టు
తెలిపారు.
5. నైపుణ్య గణన:
ఆంధ్ర లో
నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్)-2024 చేపట్టేందుకు మంత్రి
వర్గం ఆమోదం. నిర్మాణ, ఉత్పత్తి, సేవా రంగాలకు సంబంధించి యువతలో ఏ మేరకు నైపుణ్యాలు ఉన్నాయో
గుర్తిస్తారు.
ఐదు సంతకాలు కాకుండా
మిగతా కీలక నిర్ణయాలు ఇవే:
6. వైద్య
ఆరోగ్య వర్సిటీకి ‘ఎన్టీఆర్’ పేరు
పునరుద్ధరించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
7. గంజాయి
నివారణకు మంత్రివర్గ ఉపసంఘం: గంజాయి నివారణకు హోంమంత్రి అనిత
సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేయనున్నారు. గంజాయి
నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేశ్ ఉండనున్నారు.
8. ఏడు
శ్వేతపత్రాలు విడుదల చేయాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
i. పోలవరం,
ii. అమరావతి,
iii. విద్యుత్ & పర్యావరణం,
iv. లాండ్, మైనింగ్ & ఇసుక,
v. మద్యం,
vi. లా
అండ్ ఆర్డర్ (శాంతిభద్రతలు),
vii. ఫైనాన్స్
(ఆర్థిక అంశాలు).
=====================
0 Komentar