AP: Common Examination System for Classes
1 to 8 Abolished - Classroom-Based Assessment (CBA)
ఏపీ: 1-8 తరగతుల
ఉమ్మడి పరీక్ష విధానం రద్దు - తరగతి గది ఆధారిత మదింపు (సీబీఏ)
=====================
ఏపీలో ఒకటి
నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల విధానం ను హైకోర్టు రద్దు
చేసింది. విద్యార్థులకు ఏకరూప ప్రశ్నపత్రంతో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం విద్యా
హక్కు చట్టంలోని సెక్షన్ 29కి (కరిక్యులమ్, మూల్యాంకన విధానం) విరుద్ధమని తేల్చి చెప్పింది. 2022లో తీసుకొచ్చిన ఈ విధానం విద్యార్థుల హక్కులను హరించేలా
ఉందని పేర్కొంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలను నిర్దిష్ట సమయంలో
అభిప్రాయాలను చెప్పాలని ఒత్తిడి చేయడమే అవుతుందని, వారిని భయాందోళనకు గురిచేసినట్లుందని అభిప్రాయపడింది.
తరగతి గది
ఆధారిత మదింపు (సీబీఏ) ద్వారా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను
రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత ఇటీవల ఈ మేరకు తీర్పు
ఇచ్చారు. సపోర్టింగ్ ది ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రాం (సాల్ట్)
కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలను ఉమ్మడి ప్రశ్నపత్రంతో నిర్వహించాలని, ఇందుకోసం రుసుములు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యా
పరిశోధన,
శిక్షణ మండలి (ఎస్ సీఈఆర్టీ) డైరక్టర్ 2022 అక్టోబరులో ఉత్తర్వులు జారీచేశారు. 'సాల్ట్' కార్యక్రమం
పరిధిలోకి ప్రైవేటు పాఠశాలలు రావన్నారు.
విద్యా హక్కు
చట్టంలోని సెక్షన్ 30 ప్రకారం ఎలిమెంటరీ
విద్య పూర్తి అయ్యేంత వరకు ఏ విద్యార్థి 'బోర్డు
పరీక్ష’లో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. సీబీఏ విధానం బోర్డు
పరీక్ష కానప్పటికీ.. టైం టేబుల్ నిర్ణయించడం, ఏకరూప
ప్రశ్నాపత్రంతో అందరికి కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించడం 'బోర్డు పరీక్షలా ఉందన్నారు.
అంతకు ముందు
ఈ పరీక్షలకి ముందు
ఫార్మెటివ్ పరీక్షలను పాఠశాల స్థాయిలోనే నిర్వహించేవారు. ఏ పాఠశాలకు ఆ పాఠశాల
ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా ప్రశ్నపత్రాలు రూపొందించుకుని పరీక్షలు
నిర్వహించేవారు.
=====================
0 Komentar