Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Conduct of Skill Census - 2024 in the State of Andhra Pradesh – G.O. Released

 

AP: Conduct of Skill Census - 2024 in the State of Andhra Pradesh – G.O. Released

ఏపీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్య గణన - 2024 – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

================

ఆంధ్ర లో నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్)-2024 చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైపుణ్య గణన దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే గణనకు మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

నిర్మాణ, ఉత్పత్తి, సేవా రంగాలకు సంబంధించి యువతలో ఏ మేరకు నైపుణ్యాలు ఉన్నాయో గుర్తిస్తారు. పరిశ్రమల అవసరాలు, యువతకు మధ్య ఉన్న నైపుణ్య అంతరాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో 310 ఇంజినీరింగ్ కళాశాలలు, 1400 డిగ్రీ కళాశాలలు, 267 పాలిటెక్నిక్ లు, 516 ఐటీఐలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా 4.4 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నా సరైన నైపుణ్యాలు లేక చాలామంది నిరుద్యోగులుగానే మిగులుతున్నారు. వీరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి? పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎలాంటి నైపుణ్యాలు అవసరమో గణన గుర్తిస్తుంది.

ఈ సర్వేకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ఓసీ) నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. పోటీకి అనుగుణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సిఫార్సులు చేస్తుంది.

================

Skills Development and Training Department - Conduct of Skill Census - 2024 in the State of Andhra Pradesh - Orders - Issued.

SKILLS DEVELOPMENT AND TRAINING (SKILL) DEPARTMENT

G.O.Ms.No. 13, Dated: 13.06.2024

Skill development plays a critical role in the economic and social development of a country. Skilled manpower is key to leveraging the opportunities presented by globalization. An emerging economy such as India requires a large skilled workforce. However, skill shortage is evident in every sector of the economy, and it is proving to be a roadblock to growth.

పూర్తి వివరాల కొరకు క్రింద ఇవ్వబడ్డ జీ.ఓ ని డౌన్లోడ్ చేసుకోండి.   

================

DOWNLOAD G.O.13

================

Previous
Next Post »
0 Komentar

Google Tags