Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: G.O. Released on Increase of Pensions in the State - Complete Details Here

 

AP: G.O. Released on Increase of Pensions in the State - Complete Details Here

ఏపీ: పింఛన్ల పెంపుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ పూర్తి వివరాలు ఇవే

===================

ఆంధ్ర లో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్ పై మూడో సంతకం చేశారు. ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్ ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన 'ఎన్టీఆర్ భరోసా' పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్ ను పెంచి ఒకేసారి రూ.4 వేలు అందజేయనున్నారు. వీరికి ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జులై 1న పింఛను కింద వీరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి మూడు నెలలకు రూ. వెయ్యి చొప్పున కలిపి) అందిస్తారు.

దివ్యాంగులకు ప్రస్తుతం అందుతున్న రూ.3 వేలను ఒకేసారి రూ.6 వేలకు పెంచారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్చైర్లో ఉన్న వారికి అందే రూ.5 వేల పింఛను రూ.15 వేలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె

మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్ఠు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి రూ.6 వేలు పింఛను ఇవ్వనున్నారు.

===================

Rural Development Department – Social Security Pensions (SSP) - Enhancement of the existing pension amount for different categories of pensioners and restoring the name of the scheme as “NTR Bharosa Pension Scheme”– Orders – Issued. 

PANCHAYAT RAJ AND RURAL DEVELOPMENT (RD.I) DEPARTMENT

G.O.Ms.No.43 Dated: 13.06.2024

===================

DOWNLOD G.O.43

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags