Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP-TET July 2024: All the Details Here

 

AP-TET July 2024: All the Details Here

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై 2024: పూర్తి వివరాలు ఇవే

=====================

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)- జులై 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్ధులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2(, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై - 2024:

అర్హతలు: పేపర్ ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమానం.

కమ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు

1. ఓసీ (జనరల్)- 60% మార్కులు ఆపైన

2. బీసీ- 50% మార్కులు ఆపైన

3. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్మెన్- 40% మార్కులు ఆపైన

టెట్ ప్రశ్నపత్రాలు:

> పేపర్-1, పేపర్-1బి: 5 విభాగాల్లో 150 ప్రశ్నలు- 150 మార్కులకు నిర్వహిస్తారు.

> పేపర్-2, పేపర్-2బి: 4 విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలు- 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.

పరీక్ష రుసుము: పేపర్ కు రూ.750.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 02/07/2024

దరఖాస్తు రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 03/07/2024

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 16/07/2024

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 04/07/2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 17/07/2024

మాక్ టెస్ట్ ప్రారంభ తేదీ: 16/07/2024

హాల్ టికెట్లు విడుదల తేదీ: 25/07/2024

పరీక్షల తేదీలు: 05/08/2024 నుండి 20/08/2024 వరకు

ప్రిలిమినరీ కీ లు విడుదల తేదీ: 10/08/2024 నుండి

‘కీ’ అభ్యంతరాల స్వీకరణ తేదీలు: 11/08/2024 నుండి 21/08/2024 వరకు

తుది కీ విడుదల తేదీ: 25/08/2024

ఫలితాలు విడుదల తేదీ: 30/08/2024  

=====================

PAYMENT

NOTIFICATION

INFORMATION BULLETIN

SCHEDULE

NEW SYLLABUS

PRESS NOTE

WEBSITE

===================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags