Ferguson's Record - 4 Overs Maidens in T20s - Boult Retires
from International Cricket
టీ20 లో నాలుగు ఓవర్లనూ మెయిడిన్ లతో రికార్డు సాధించిన ఫెర్గూసన్
– అంతర్జాతీయ క్రికెట్ నుంచి బౌల్ట్ రిటైర్
=====================
న్యూజిలాండ్
పేసర్ లాకీ ఫెర్గూసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచ కప్ లో నామమాత్రమైన తన ఆఖరి
మ్యాచ్ (గ్రూప్-సి)లో న్యూజిలాండ్ 7 వికెట్ల
తేడాతో పాపువా న్యూగినీని చిత్తు చేసింది.
కివీస్
బౌలర్ల ధాటికి మొదట న్యూగినీ 19.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఫెర్గూసన్ (4-4-0-3) సంచలన ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లనూ మెయిడిన్ చేశాడు.
స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
న్యూజిలాండ్
ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్ ఘనత
సాధించాడు. పసికూన పాపువా న్యూగినీతో టీ20 ప్రపంచకప్
మ్యాచ్ అతడు నాలుగు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో
ప్రత్యర్థి 78 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటికే
సూపర్-8కు దూరమైన న్యూజిలాండ్ ఘనవిజయంతో టోర్నీని ముగించింది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన కివీస్ బౌలర్ బౌల్ట్ ఇదే చివరి మ్యాచ్. 78 టెస్టుల్లో 317 వికెట్లు, 114 వన్డే లలో 211 వికెట్లు, 61 టీ20 లలో 83 వికెట్లు సాధించాడు.
=====================
0 Komentar