French Open Men’s
Final 2024: Carlos Alcaraz beats Alexander Zverev to Claim First French Open
ఫ్రెంచ్
ఓపెన్ 2024: పారిస్ లో కొత్త విజేత గా 21 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ - మూడు భిన్నమైన కోర్టుల లో గ్రాండ్ స్లామ్ లను చేజిక్కుంచుకున్న
అల్కరాజ్
=====================
రోలాండ్
గారోస్ నూతన ఛాంపియన్ స్పెయిన్ వీరుడు అల్కరాస్ ఎర్రకోటలో జెండా ఎగరేశాడు. ఆదివారం
రసవత్తరం గా జరిగిన ఫైనల్లో 6-3, 2-6, 5-7, 6-1, 6-2తో నాలుగోసీడ్ జ్వెరవ్ ని ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. 4 గంటలకు పైగా జరిగిన ఈ పోరులో 1-2 సెట్ ల తో వెనుకబడి కూడా అల్కరాస్ పుంజుకుని విజయాన్ని
అందుకున్నాడు.
తొలి సెట్లో
అల్కరాసే పైచేయి. మెరుపు సర్వీసులు, క్రాస్కోర్టు
విన్నర్లతో విజృంభించిన ఈ స్పెయిన్ స్టార్.. తొలి గేమ్లోనే ప్రత్యర్థి సర్వీస్
బ్రేక్ చేశాడు. తర్వాత అయిదో గేమ్ లో మరో బ్రేక్ సాధించి తేలిగ్గా తొలి సెట్
నెగ్గాడు. కానీ జ్వెరెవ్ వెంటనే పుంజుకున్నాడు. రెండో సెట్ అయిదో గేమ్ బ్రేక్
సాధించిన అతడు ఆపై సెట్ గెలిచి స్కోరు సమం చేశాడు. ఈ క్రమంలో అతడు నెట్ సమీపంలో
కొట్టిన ఓ క్రాస్ కోర్టు ఫోర్ హ్యాండ్ విన్నర్ హైలైట్. ఇదే జోరును మూడో సెట్లోనూ
చూపించిన జ్వెరెవ్ కష్టపడకుండానే సెట్ గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకున్నాడు.
కానీ
అల్కరాస్ నాలుగో సెట్లో పట్టుదలగా పోరాడాడు. ఒత్తిడిని చిత్తు చేస్తూ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లిన అతడు.. అదే జోరుతో సెట్ గెలిచి
మ్యాచ్లో నిలిచాడు. ఈ క్రమంలో అతడు ఒక్క గేమే చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మక అయిదో
సెట్లో అల్కరాస్ దూకుడు పెంచాడు. 4 గేముల్లో
మూడు తానే సొంతం చేసుకుని 3-1తో ఆధిక్యంలో
నిలిచాడు. జ్వెరెవ్ ప్రతిఘటించినా అల్కరాస్ అవకాశాన్ని వదల్లేదు. ఏడో గేమ్ బ్రేక్
సాధించి 5-2తో నిలిచిన అతడు.. తర్వాత సర్వీస్ నిలబెట్టుకుని టైటిల్
ఎగరేసుకుపోయాడు.
ముఖ్యాంశాలు
> పిన్న
వయసులో మూడు భిన్నమైన కోర్టులపై గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడు
అల్కరాస్ (21ఏళ్లు). జిమ్మి
కానర్స్ (అమెరికా, 22 ఏళ్లు)ను
అధిగమించాడు.
> నాదల్
(19)
తర్వాత రొలాండ్ గారోస్ టైటిల్ గెలిచిన రెండో పిన్న వయస్కుడు
అల్కరాస్ (21)
> కెరీర్లో
అల్కరాస్ సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిళ్లు 3. 2022లో యుఎస్ ఓపెన్, 2023 లో వింబుల్డన్ మరియు ఇప్పుడు ఈ టైటిల్ నెగ్గాడు.
> గత
పదేళ్లలో నాదల్, జకోవిచ్, వావ్రింకా కాకుండా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచింది అల్కరాస్
మాత్రమే.
=====================
0 Komentar