IBPS CRP RRB Recruitment 2024: Apply for
9,995 Officers and Office Assistants (Multipurpose) in Regional Rural Banks
(RRBs) – Details Here
ఐబీపీఎస్-
గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్ & ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే
======================
ఐబీపీఎస్ -
రీజినల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ - XIII (సీఆర్పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను
విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా 9,995 గ్రూప్ ఎ- ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి.
గ్రామీణ
బ్యాంకులు: ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య
గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ
బ్యాంక్,
సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, విదర్భ కొంకణ్
గ్రామీణ బ్యాంక్ తదితరాలు.
ఖాళీల
వివరాలు:
1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5,585 పోస్టులు
2. ఆఫీసర్ స్కేల్-I: 3499 పోస్టులు
3. ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్
ఆఫీసర్): 70 పోస్టులు
4. ఆఫీసర్ స్కేల్-II (లా): 30 పోస్టులు
5. ఆఫీసర్ స్కేల్-II (సీఏ): 60 పోస్టులు
6. ఆఫీసర్ స్కేల్-II (ఐటీ): 94 పోస్టులు
7. ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్
ఆఫీసర్): 496 పోస్టులు
8. ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్
ఆఫీసర్): 11 పోస్టులు
9. ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్): 21 పోస్టులు
10. ఆఫీసర్ స్కేల్-III: 129 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 9,995.
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై
ఉండాలి.
వయోపరిమితి (01-06-2024 నాటికి): ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) 18-30 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) 21-32 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) 21-40 ఏళ్లు; ఆఫీస్ అసిస్టెంట్లకు
(మల్టీపర్పస్) 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు
రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.
తెలుగు
రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/
సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం తేదీ: 07.06.2024
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 27.06.2024
======================
APPLY HERE - OFFICE ASSISTANTS (Turn Your Mobile)
APPLY
HERE - OTHERS
======================
0 Komentar