Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICC T20 World Cup 2024: India beat South Africa in the Final – Clinches Second T20I World Cup after 17 Years

 

ICC T20 World Cup 2024: India beat South Africa in the Final – Clinches Second T20I World Cup after 17 Years

టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా భారత్ - 17 సంవత్సరాల తర్వాత రెండవ T20I ప్రపంచ కప్‌ కైవసం

=====================

గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమి బాధ తో ఉన్న అభిమానులకు ఇప్పుడు ఆనందం.

ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికా చేయాల్సింది 30 బంతుల్లో 30 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కలలోనైనా అనుకుంటారా! కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీస్ఇండియా.. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది.

రెండొందల పరుగులు చేయొచ్చనుకున్న పిచ్ పై మొదట భారత్ 7 వికెట్లకు 176 పరుగులే చేసింది. కోహ్లి (76), అక్షర్ (47) రాణించారు. ఛేదనలో హార్దిక్ (3/20), బుమ్రా (2/18), అర్షదీప్ (2/20) సూపర్ బౌలింగ్కు దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది.

16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్151/4. ఒకవైపు విధ్వంసక షాట్లతో యథేచ్ఛగా విరుచుకుపడుతున్న క్లాసెన్. మరోవైపు ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన బౌలర్లు. డీలాపడ్డ ఫీల్డర్లు. వాళ్ల శరీర భాషలో అది స్పష్టం. కానీ చచ్చిపోయిన భారత్ ఆశలకు హార్దిక్ జీవం పోశాడు. 17వ ఓవర్లో ప్రమాదకర క్లాసెన్ (52)ను ఔట్ చేయడమే కాకుండా.. 4 పరుగులే ఇచ్చాడు. టీవీలు కట్టేద్దామని అభిమానులు చేతుల్లోకి తీసుకున్న రిమోట్లన్నీ యథాస్థానాల్లోకి వెళ్లిపోయాయి. అప్పుడొచ్చాడు ఆపద్బాంధవుడు బుమ్రా. తన ఆఖరి ఓవర్లో అదరహో అనిపించాడు. మిణుకు మిణుకుమంటున్న టీస్ఇండియా ఆశలకు రెక్కలు తొడుగుతూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి యాన్సెను ఔట్ చేసి తనకూ అవకాశముందని భారత్ కు బలమైన నమ్మకం కలిగించాడు.

ఆ తర్వాత బాధ్యత అర్జీప్ (19వ ఓవర్) తీసుకున్నాడు. 0, 0, 1, 2, 1, 0.. ఇదీ అతడి వండర్ ఓవర్! ఒక్కసారిగా భారత్ ఫేవరెట్ గా మారిపోయింది. ఉత్కంఠ ఊపేస్తుండగా భారాన్నంతా మోస్తూ, ఒత్తిడిని జయిస్తూ హార్దిక్ చిరకాలం గుర్తుండిపోయేలా బౌలింగ్ చేశాడు. ఇక్కడ సూర్య మరో హీరో. ఆఖరి ఓవర్ తొలి బంతికి అతడు అందుకున్న క్యాచ్ కు మిల్లర్ నిష్క్రమించడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. సిక్స్ వెళ్లడం ఖాయమనుకున్న బంతిని బౌండరీ లైన్ వద్ద అతడు కళ్లు చెదిరే రీతిలో అందుకున్న తీరు అభిమానుల స్మృతిపథంలో చాన్నాళ్లు ఉండిపోతుంది.

హార్దిక్ తర్వాతి బౌంతికి బౌండరీ ఇవ్వగా.. మూడు, నాలుగు బంతులకు బైలు వచ్చాయి. హార్దిక్ వైడ్ వేసినా.. ఆ వెంటనే రబాడను ఔట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైపోయింది. ఆఖరి బంతి పడగానే భారత ఆటగాళ్లు, అభిమానుల సంబరాలు మిన్నంటాయి. 

=====================

CLICK FOR HIGHLIGHTS

CLICK FOR SCORE CARD

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags