Indian Coast Guard Recruitment 2024:
Apply for 320 Navik & Yantrik Posts – Detail Here
ఇండియన్
కోస్ట్ గార్డ్ లో 320 నావిక్ & యాంత్రిక్ పోస్టులు - ప్రాథమిక వేతనం: నెలకు రూ.21,700 - రూ.29,200.
====================
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం... గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీ ఈపీటీ) -01/ 2025 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ), యాంట్రిక్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. రాత, శరీరదార్థ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ అందిస్తారు. అనంతరం సేవల్లో చేరతారు.
1. నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
రీజియన్/
జోన్ వారీ ఖాళీలు: నార్త్- 77; వెస్ట్- 66; నార్త్ ఈస్ట్- 68; ఈస్ట్- 34; నార్త్ వెస్ట్- 12, అండమాన్ అండ్ నికోబార్- 03.
2. యాంట్రిక్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60 పోస్టులు
అర్హత: నావిక్ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్), యాంత్రిక్ పోస్టులకు 10వ లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
అంటే 01-03-2003 నుంచి 28-02-2007 మధ్య
జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ప్రాథమిక
వేతనం: నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700. యాంత్రిక్ పోస్టులకు రూ.29,200.
ఎంపిక
విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష
రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 13-06-2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2024.
====================
====================
0 Komentar