Jio – Airtel - VI: Compare the Increased Prepaid Plans – Details Here
జియో - ఎయిర్ టెల్ - వొడాఫోన్ ఐడియా: పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను
ఒకదాని తో ఒకటి పోల్చి చూసుకోండి.
======================
జియో, ఎయిర్ టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వచ్చే నెల (జులై) నుండి తమ
ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచాయి. తొలుత జియో పెంపు నిర్ణయం ప్రకటించగా.. ఎయిర్ టెల్, వొడాఫోన్ అదే బాటలో నడిచాయి. జియో, ఎయిర్ టెల్ సవరించిన ప్లాన్లు జులై 3 నుంచి అందుబాటులోకి రానుండగా.. వొడాఫోన్ ఐడియా ప్లాన్లు
జులై 4 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ లోపు రీఛార్జి చేసుకున్న
వారికి పాత ధరలే వర్తిస్తాయి.
పెరిగిన
ఛార్జీలతో 28 రోజులకు జియోలో కనీస రీఛార్జి మొత్తం
రూ.189కి చేరగా.. ఎయిర్ టెల్, వొడాఫోన్
ఐడియాలో రూ. 199కి పెరిగింది. 56 రోజుల ప్లాన్ విషయంలో మూడు టెలికాం కంపెనీల ధరలు ఇంచుమించు
ఒకేలా ఉన్నాయి. ఎక్కువ మంది వినియోగించే 84 రోజుల
ప్లాన్ ధర జియోలో రూ.666 నుంచి రూ.799కి పెరగ్గా.. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు రూ.719 నుంచి ఏకంగా రూ. 859కి ఎగబాకాయి.
దీనికి తోడు
ఇన్నాళ్లు కనీస రీఛార్జి ప్యాకేజీలపై 5జీ డేటాను
ఉచితంగా,
అపరిమితంగా ఇస్తూ వచ్చిన జియో, ఎయిర్ టెల్ సంస్థలు ప్లాన్ల సవరణ సందర్భంగా కొత్త నిబంధనను
తీసుకొచ్చాయి. ఎవరైతే 2జీబీ కంటే ఎక్కువ రీఛార్జి
చేస్తారో వారికే అపరిమిత లీజీ డేటాను అందిస్తామని ప్రకటించాయి. దీంతో 5జీ ఫోన్ ఉండి అపరిమిత డేటా ఆనందించాలంటే ఎక్కువ మొత్తం
వెచ్చించాల్సి ఉంటుంది. అంటే జియో యూజర్లు 84 రోజులకు
రూ. 859తోనూ, ఎయిర్ టెల్ యూజర్లు రూ.979 రీఛార్జి
చేయాల్సి ఉంటుంది.
======================
======================
======================
0 Komentar