Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Virat Kohli & Rohit Sharma Announces Retirement from T20Is

 

Virat Kohli & Rohit Sharma Announces Retirement from T20Is

అంతర్జాతీయ టీ20ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ & రోహిత్ శర్మ

=====================

టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

విరాట్ కోహ్లీ:  

ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా  నిలిచాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 అని కోహ్లి తెలిపాడు.

“ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్. మేం సాధించాలనుకున్నది ఇదే. భారత్ తరఫున ఇదే నా చివరి టీ20. నేను ఈ ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నా. అది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ వరల్డ్ కప్ సాధించకపోయినా రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే నేను వెనక్కి తగ్గుతున్నా. ఐసీసీ టోర్నమెంట్ ను గెలవడానికి మేము చాలా కాలం వేచి ఉన్నాం. రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్ లు ఆడాడు. ఇది నాకు ఆరో ప్రపంచ కప్. ఈ వరల్డ్ కప్ విజయానికి రోహిత్ అర్హుడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. ఇది అద్భుతమైన రోజు" అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.

వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ సాధించిన అతికొద్దిమంది భారత క్రికెటర్లలో కోహ్లి ఒకడు. టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లి 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో మొత్తం 125 టీ20లు ఆడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు సాధించాడు.

రోహిత్ శర్మ:  

భారత జట్టు సారధి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచిన అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు. రోహిత్ ప్రకటించడానికి కొన్నినిమిషాల ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20కి వీడ్కోలు పలికాడు. దీంతో ఒకేరోజు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు టీ20 బరి నుంచి తప్పుకోవడం భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజుగా మిగిలిపోనుంది.

మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ మాట్లాడుతూ.. “టీ20లకు ఇదే నా చివరి మ్యాచ్. వీడ్కోలుకు ఇంతకుమించి ప్రకటించే మంచి సందర్భం లేదు. ఈ ట్రోఫీ కచ్చితంగా గెలవాలనుకున్నా. ఈ విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదు. నేను కోరుకున్నదే జరిగింది. ఈ సందర్భం రావడానికి నా జీవితంలో ఎంతో ఎదురుచూశాను. ఎంతో నిరాశకు గురయ్యాను. ఎట్టకేలకు ఆ హద్దులు దాటి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది" అని 37 ఏళ్ల రోహిత్ పేర్కొన్నాడు.

ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 159 మ్యాచ్ లు డిన రోహిత్.. 4231 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు, 32 అర్ధశతకాలు ఉన్నాయి. రోహిత్ సారథ్యంలోనే భారత్ వన్డేలు, టెస్టు మ్యాచ్లు ఆడనుంది.

=====================

KOHLI PROFILE

ROHIT PROFILE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags