Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIVE: Hon'ble CM of AP Sri. Nara Chandra Babu Naidu took the Charge in the Secretariat - Mega DSC Posts - Details Here

 

LIVE: Hon'ble CM of AP Sri. Nara Chandra Babu Naidu took the Charge in the Secretariat - Mega DSC Details Here 

ఏపీ: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులైన శ్రీ. నారా చంద్ర బాబు నాయుడు గారు – మెగా డీఎస్సీ పై తొలి సంతకం – మరో నాలుగు హామీలపై సంతకం

=====================

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు  గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ లో  వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైల్ పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.

=====================

5 హామీలపై సంతకం

1. మెగా డీఎస్సీ

2. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు

3. సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు

4. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ

5. నైపుణ్య గణన

=====================

మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు:  

మొత్తం పోస్టులు: 16,347 టీచర్ పోస్టులు

కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు:

ఎస్జీటీ:  6,371;

పీఈటీ: 132;

స్కూల్ అసిస్టెంట్స్: 7725;

టీజీటీ: 1781;

పీజీటీ: 286;

ప్రిన్సిపల్స్: 52

=====================

Official YouTube Links:

https://www.youtube.com/watch?v=gydfV_DG8tc

https://www.youtube.com/watch?v=NzBRZM9hpFA

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags