Media Tycoon Ramoji
Rao Dies At 87
మీడియా
దిగ్గజం పద్మ విభూషణ్ రామోజీరావు (87) ఇకలేరు
=======================
ఈనాడు గ్రూప్
& రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి
రామోజీరావు(87) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్
లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి
ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు.
1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో
రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం
సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో 'ఈనాడు'ను ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల
మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా 'సితార' సినీ పత్రిక
నిలిచింది.
రైతుబిడ్డగా
మొదలై వ్యాపారవేత్తగా రాణించి లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా
పరిశ్రమించిన యోధుడు. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు అద్భుతమైన ఫిల్మ్
సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. పనిలోనే విశ్రాంతి
అనేది ఆయన ప్రాథమిక సూత్రం.
=====================
రామోజీ రావు గురించి
తెలుసుకోవాలిసిన విషయాలు ఇవే
కుటుంబ
నేపథ్యం
రామోజీరావు
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు
మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో
పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు
పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు
ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క
పేరు రంగనాయకమ్మ.
బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 - 1961)
ఇతని
కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని
చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో
సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి.
రామయ్య అన్న
తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా "రామోజీ రావు"
అన్న పేరును సృష్టించుకుని, తానే
పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ
కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివాడు.
1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది.
రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది.
రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు
ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్
మాజీ ఎండీగా కలసి పనిచేశారు.
ఉద్యోగం, వ్యాపారాల ఆరంభం (1960 - 1970)
రామోజీరావు
తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్
ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై
ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాకా
ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు. మూడు
సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగివచ్చాడు.
రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్
ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967 - 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట
ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు. 1969లో రామోజీరావు
ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు. 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ
ప్రారంభించాడు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకోసాగింది.
డాల్ఫిన్
హోటల్స్,
ఈనాడు ప్రారంభం (1971-1974)
విశాఖపట్నంలో
డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు 1970లో నిర్ణయించుకుని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించాడు.
రామోజీ
గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్
మూవీస్,
రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి
షోరూములు ముఖ్యమైనవి.
వ్యాపారాలు
> రామోజీ
ఫిల్మ్ సిటీ
> ఈనాడు పత్రిక
> వసుంధర
పబ్లికేషన్స్: సితార, అన్నదాత
> రామోజీ
ఫౌండేషన్: చతుర, విపుల, అన్నదాత, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికలు 2021 మార్చి సంచికతో మూతపడ్డాయి.
> ఈ టీవి, ఈటివి 2, ఈ టివి కన్నడ, మరాఠి, ఉర్దు, బెంగాలి, ఒరియా, గుజరాతీ, బీహార్
> ఉషా
కిరణ్ మూవీస్
> మార్గదర్శి
చిట్ ఫండ్స్
> కళాంజలి
- సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి
> బ్రిసా
- ఆధునిక వస్త్రాలు
> ప్రియా
ఫుడ్స్ - పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
> డాల్ఫిన్
హోటల్
> కొలోరమ
ప్రింటర్స్
నిర్మించిన
సినిమాలు
శ్రీవారికి
ప్రేమలేఖ (1984)
మయూరి (1985)
మౌన పోరాటం (1989)
ప్రతిఘటన (1987)
పీపుల్స్ ఎన్‌కౌంటర్
(1991)
అశ్వని (1991)
చిత్రం (2000)
మెకానిక్
మామయ్య
ఇష్టం (2001)
నువ్వే
కావాలి (2000)
ఆనందం (2001)
ఆకాశ వీధిలో
(2001)
మూడుముక్కలాట
నిన్ను
చూడాలని (2001)
తుఝె మేరీ
కసమ్
వీధి (2005)
నచ్చావులే (2008)
నిన్ను
కలిసాక (2009)
సవారి (కన్నద
గమ్యమ్) (2009)
పురస్కారాలు /
గౌరవాలు
ఆంధ్ర
విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు.
శ్రీవేంకటేశ్వర
విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు.
శ్రీశ్రీ
రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు.
యుధవీర్
అవార్దు.
కెప్టెన్
దుర్గాప్రసాద్ చౌదురి (రాజస్తాన్) అవార్డు.
బి. డి.
గోయెంకా అవార్డు.
పద్మవిభూషణ్
(2016
సాహిత్యం, విద్య విభాగాలలో).
=======================
0 Komentar