Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Awards to Teachers 2024 – All the Details Here

 

National Awards to Teachers 2024 – All the Details Here

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు 2024 – పూర్తి వివరాలు ఇవే

======================

======================

UPDATE 27-08-2024

National Teachers’ Awards 2024:

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీతల జాబితా విడుదల

తెలుగు రాష్ట్రాల అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు వీరే

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు మరియు తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు అవార్డు వరించింది. 

ఆంధ్ర ప్రదేశ్:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఇద్దరు ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. కృష్ణా జిల్లా గుడివాడలోని ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్ టీచర్ మిద్దె శ్రీనివాసరావు, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం మిద్దె శ్రీనివాసరావు కూనాటి సురేష్ ఊరందూరు జడ్పీ హైస్కూల్ సోషల్ టీచర్ కూనాటి సురేష్ ఈ అవార్డులకు ఎంపికయ్యారు. 

శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామానికి చెందిన సురేష్ గారు ఊరందూరు ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తూనే పాఠ్యపుస్తకాలను రూపొందించడం, డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేయడం, ఉచిత పాఠ్యాంశాలను బోధించే మొబైలు యాప్ అందించడం వంటి సేవలందించారు.

KUNATI SURESH YOUTUBE CHANNEL

మిద్దె శ్రీనివాసరావు గారు (గుడివాడ)9, 10వ తరగతుల భౌతిక రసాయన శాస్త్రం, 7వ తరగతి సామాన్య రసాయనశాస్త్రం పాఠ్య పుస్తకాలను రచించారు.

MIDDE SRINIVASA RAO YOUTUBE CHANNEL 

 

తెలంగాణ:  

ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్ రెడ్డి, సిరిసిల్ల దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తాండూరి సంపత్ కుమార్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న తాడూరి సంపత్ కుమార్  'జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు-2024' పురస్కారానికి ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 'మిషన్ 100' కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా 53 మందిని ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దారు. వీరు ఇప్పటివరకు 16 జాతీయ, 8 ఇంటర్నేషనల్, 30కి పైగా రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో వరుసగా 2018 నుంచి 2023 వరకు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.

SAMPATH KUMAR YOUTUBE CHANNEL

నూతన పద్ధతులతో పాఠాలకు జీవం పోస్తున్న ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్రెడ్డికి 'జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు-2024' అవార్డు దక్కింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో పనిచేశారు. ప్రతిచోట పిల్లలను క్షేత్ర స్థాయి ప్రదర్శనలకు తీసుకెళ్తూ, డిజిటల్ బోధన సామగ్రిని వినియోగిస్తూ సులువుగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తారు. 2008లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2018లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్న ఈయన టి-శాట్, విద్య, నిపుణ, దూరదర్శన్ వంటి కార్యక్రమాల్లో దాదాపు 49 పాఠాలు బోధించారు.

PRABHKAR REDDY YOUTUBE CHANNEL

CLICK OFF SELECTED TEACHERS

======================

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర విద్యా శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పాఠశాల విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి జ్యూరీ తుది జాబితాను ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. జూలై 01 వరకు క్రింద ఇవ్వబడ్డ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

నామినేషన్ / దరఖాస్తు కి చివరి తేదీ: 01/07/2024  


======================

APPLY HERE

GUIDELINES

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags