Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Netflix Co-Founder Marc Randolph Shares His Father's Handwritten Note Before Starting the Job

 

Netflix Co-Founder Marc Randolph Shares His Father's Handwritten Note Before Starting the Job

నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ తాను ఉద్యోగం ప్రారంభించే ముందు తన తండ్రి చెప్పిన 8 సూత్రాలు ఇవే

====================

సోషల్ మీడియా వేదికగా ఎందరో సీఈఓలు, వ్యాపార దిగ్గజాలు, ప్రముఖ సంస్థల ఎండీలు కెరియర్ సలహాలు, సూచనలు చేస్తుంటారు. అంతేకాదు తమ జీవితంలో జరిగిన సంఘటనలు, ఎదురైన అనుభవాలను ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. తాజాగా నెట్ప్లెక్స్ (Netflix) సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ మార్క్ రాండోల్ఫ్ (Marc Randolph) కూడా ఓ విషయాన్ని పంచుకున్నారు. ఉద్యోగం మొదలు పెట్టేముందు తన తండ్రి చెప్పిన 8 టిప్స్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.

1. అడిగిన దానికంటే 10శాతం అధికంగా పని చేయి.

2. తెలియని విషయాలపై ఎప్పటికీ, ఎవ్వరితోనూ నీ అభిప్రాయం పంచుకోకు

3. ఎటువంటి స్థితిలో ఉన్నా మర్యాదగా ప్రవర్తించు. శ్రద్ధగా మెలుగు.

4. ఎప్పుడూ ఫిర్యాదు చేయొద్దు. తీవ్రమైన విమర్శలనైనా ఎదుర్కో.

5. మీకు వాస్తవం తెలిసినప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు.

6. అవసరమైన చోట లెక్కలు వేయడం నేర్చుకో

7. ఓపెన్ మైండెడ్ గా ఉంటూ, ప్రతీ విషయాన్ని ఓ కంట కనిపెడుతుండాలి.

8. ఏ విషయంలోనైనా తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలి.

"21 సంవత్సరాల వయసులో కాలేజీ నుంచి బయటకు వచ్చి మొదటి ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో మా నాన్న చేతితో రాసిన ఈ టిప్స్ లిస్ట్ను ఇచ్చారు. నా విజయంలో ఈ అంశాలు కీలక భూమిక పోషించాయి. వీటినే నా పిల్లలకు అందించాను" అని రాండోల్ఫ్ పేర్కొన్నారు.

తన తండ్రి చేతి రాతతో ఉన్న విషయాలకు సంబంధించిన నోట్ను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్ పై పలువురు రాండోల్ఫ్ తండ్రిని కొనియాడుతున్నారు. "ఇవి నిజంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు. ముఖ్యంగా ఉద్యోగంలో అడుగుపెట్టేముందు" అంటూ యూజర్లు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags