PNB Recruitment 2024: Apply for 2700
Apprentice Posts – Details Here
పంజాబ్
నేషనల్ బ్యాంకులో 2,700 అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్ : నెలకు రూ.10,000. - రూ.15,000.
====================
పంజాబ్
నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, మానవ వనరుల
విభాగం... దేశ వ్యాప్తంగా పీఎన్బీ శాఖల్లో 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు
ఆన్లైన్లో జులై 14వ తేదీలోగా దరఖాస్తు
చేసుకోవచ్చు.
అప్రెంటిస్: 2,700 ఖాళీలు (ఏపీలో 27, తెలంగాణలో 34 ఖాళీలు ఉన్నాయి)
అర్హత: ఏదైనా
విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 30.06.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు
పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్:
నెలకు రూరల్/ సెమీ అర్బన్ ప్రాంతానికి రూ.10,000. పట్టణ ప్రాంతానికి రూ.12,000. మెట్రో ప్రాంతానికి
రూ.15,000
.
శిక్షణ
వ్యవధి: ఏడాది.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్
టెస్ట్,
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
ఆన్లైన్ రాత
పరీక్ష: జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు-
25 మార్కులు), జనరల్
ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్
అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్
నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు).
పరీక్ష
వ్యవధి: 60 నిమిషాలు.
పరీక్ష
మాధ్యమం: ఇంగ్లిష్ / హిందీ.
దరఖాస్తు
రుసుము: జనరల్/ ఓబీసీలకు రూ.944. మహిళలు/ ఎస్సీ/
ఎస్టీలకు రూ.708. దివ్యాంగులకు రూ.472.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ ప్రారంభం: 30.06.2024.
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 14.07.2024.
ఆన్లైన్
పరీక్ష తేదీ: 28.07.2024.
====================
====================
0 Komentar