Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Multi-Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) Examination, 2024 – Details Here

 

SSC Multi-Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) Examination, 2024 – Details Here

ఎస్ఎస్సీ: మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ అండ్ - సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2024 – పూర్తి వివరాలు ఇవే

======================

స్టాఫ్ సెలక్షన్ కమిషన్... కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

1. మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్): 4887 పోస్టులు

2. హవల్దార్ (గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్): 3439 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 8,326

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-08-2023 నాటికి పోస్టులను అనుసరించి 18-25, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఎంటీఎస్ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 27-06-2024.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 31-07-2024.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష పరీక్షల నిర్వహణ: అక్టోబర్/నవంబర్, 2024.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 10 ని చూడండి.

======================

NOTIFICATION

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags