Telangana: New State
Anthem 'Jaya Jayahe Telangana' Released - Telangana into Three Zones: CM
Revanth
తెలంగాణ: రాష్ట్ర
గీతం 'జయ జయహే తెలంగాణ' విడుదల - మూడు జోన్లుగా తెలంగాణ: సీఎం రేవంత్
======================
తెలంగాణ రాష్ట్ర
ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భం లో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ‘రాష్ట్ర
ఆవిర్భావ వేడుక’ల్లో సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి పోలీసుల నుంచి
గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ'ను సీఎం రేవంత్ విడుదల చేశారు.
తెలంగాణా తన 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భం లో "జయ జయ హే
తెలంగాణ" అనే కొత్త గీతం విడుదల అయ్యింది. అందె శ్రీ రాసిన ఈ పాటకు అకాడమీ
అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందించారు.
మూడు
జోన్లుగా తెలంగాణ
తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి
ప్రకటించారు.
1. హైదరాబాద్
ఓఆర్ఆర్ (ORR) పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్
తెలంగాణ,
2. ఓఆర్ఆర్ (ORR) నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాంతం
వరకు సబ్ అర్బన్ తెలంగాణ,
2. రీజినల్
రింగ్ రోడ్డు (RRR) నుంచి తెలంగాణ సరిహద్దు వరకు
గ్రామీణ తెలంగాణ
మూడు
ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని తెలిపారు.
======================
0 Komentar