Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

World Environment Day (June 05): Know the History, Theme and Importance Details Here

 

World Environment Day (June 05): Know the History, Theme and Importance Details Here

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 05) - చరిత్ర, ప్రాముఖ్యత మరియు థీమ్ వివరాలు ఇవే

====================

పవిత్రమైన పర్యావరణాన్ని ప్రజలు అవగాహనా రాహిత్యం వల్ల ఎంతగా పాడు చేస్తున్నారో కళ్ళారా చూసిన ఐక్యరాజ్యసమితి 1972 జూన్ 5 నుండి 16వ తేదీ వరకూ  అవగాహనా సదస్సు కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ 1973వ సంవత్సరం జూన్ 5వ తేదీన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా మొదటిసారిగా పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇక ఆనాటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1974లో ‘ఒకే ఒక్క భూమి’ థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలా ప్రతిసారీ ఒక్కో థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు.

ప్రాణవాయువు విలువ తెలిసొచ్చింది.. కరోనా నేపథ్యంలో ప్రాణవాయువు అంటే ఏమిటో సాధారణ ప్రజలకు సైతం బాగా అర్థమయింది. వైరస్‌ సోకి ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడం అటుంచితే.. చెట్లను నరికివేయడం ద్వారా పచ్చదనం కరువై స్వచ్ఛమైన గాలి అందకపోతే అనేక అనర్థాలు తలెత్తుతాయమని మాత్రం అర్థం అయింది. వాతావరణంలోని కార్బన్‌ డైఆక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ విడుదల చేసే చెట్ల పెంపకం, సంరక్షణపై ఇప్పటికైనా మేల్కోవాలని జాగృతం కావాల్సిన అవసరం ఉంది. పర్యావరణ విఘాతానికి ఘన, జీవ వ్యర్థాలు, ఈ- వ్యర్థాలు పెద్ద ఎత్తున కారణమవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న వివిధ రకాల కాలుష్యాలతో వాతావరణ మార్పులు ఏర్పడి జీవుల మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. వాటి నివారణకు ప్రతిఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

భూమిపై సగభాగం అడవులతో పచ్చదనం అలరారుతుంటేనే పర్యావరణం సమతులంగా ఉంటుంది. కానీ నాగరికత పేరుతో అడవులను నరికి వేయడంతో పచ్చదనం కరవైపోతోంది. దట్టమైన అడవులతో.. వివిధ జీవులతో కళకళ లాడిన పర్యావరణం నేడు సమతుల్యత కోల్పోయి పలు అనర్థాలు ఎదురవుతున్నాయి. భూమి, గాలి, నీరు అన్నీ కలుషితమైపోతున్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వినియోగం, వ్యర్థాలతో పర్యావరణానికి పెను విఘాతం కలుగుతోంది. పంట దిగుబడుల కోసం విచ్చల విడిగా రసాయన మందుల వాడకం ప్రకృతి వినాశనానికి దారితీస్తోంది. వీటన్నింటిని నుంచి బయటపడాలంటే విస్తారంగా మొక్కలను పెంచడమే ఏకైక మార్గం అన్న విషయాన్ని గుర్తించాలి. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరు పచ్చదనం పెంపు, ప్రకృతి పరిరక్షణకు ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది.

కరోనా ప్రభావం జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపినా.. ఒకింత పర్యావరణానికి మాత్రం మేలే చేసిందని చెప్పాలి. కొన్ని నెలలపాటు పరిశ్రమలు మూతపడటంతో వాయు కాలుష్యం బాగా తగ్గింది. వాహనాల రాకపోకలు తగ్గడంతో కర్బన ఉద్గారాల విడుదల తగ్గి పర్యావరణ సమతుల్యతకు దోహదపడింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గి గతేడాది నుంచి ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి.పరిశ్రమలు, వాహనాల రాకపోకలు కొనసాగుతున్నా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టి ఉష్ణోగ్రతలు తగ్గించుకోగలిగితే ప్రకృతికి ఎంత మేలు జరుగుతుందో ఈ కరోనా సమయంలో పాఠం నేర్చుకోవాలి.

Themes:

2016: Zero Tolerance for the Illegal Wildlife trade.

2017: Connecting People to Nature – in the city and on the land, from the poles to the equator.

2018: Beat Plastic Pollution.

2019: Beat Air Pollution

2020: Time for Nature.

2021: Ecosystem restoration.

2022: Only One Earth.

2023: Solutions to Plastic Pollution.

2024: Land restoration, desertification and drought resilience.

====================

ప్రకృతిని కాపాడితేనే మీరు సేఫ్.. ఈ సింపుల్ టిప్స్‌తో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 👇

CLICK HERE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags