Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bajaj Auto Launches World's First CNG-Powered Bike ‘Freedom 125’ – Features and Price Details Here

 

Bajaj Auto Launches World's First CNG-Powered Bike ‘Freedom 125’ – Features and Price Details Here

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ (CNG) బైక్ 'ఫ్రీడమ్ 125'ని విడుదల చేసిన బజాజ్ ఆటో - ఫీచర్లు మరియు ధర వివరాలు ఇవే

=====================

తొలి సీఎన్జీ (CNG) బైక్ ను బజాజ్ ఆటో శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 (Freedom 125) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్జీ తో పాటు పెట్రోల్ తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్ ను అమర్చారు. పెరిగిన పెట్రోల్ ధరల నుంచి వాహనదారులకు ఈ బైక్ ఊరటనిస్తుందని బజాజ్ ఆటో తెలిపింది.



వేరియంట్ & ధర

ఫ్రీడమ్ 125 బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రీడమ్ (Freedom 125) డిస్క్ ఎల్ఈడీ, ఫ్రీడమ్ డ్రమ్ ఎల్ఈడీ, ఫ్రీడమ్ డ్రమ్ వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది. డ్యూయల్ టోన్ కలర్తో ఏడు రంగుల్లో ఈ బైక్ లభిస్తుందని తెలిపింది.  డిస్క్ ఎల్రడీ వేరియంట్ ధరను రూ.1.10 లక్షలుగా కంపెనీ పేర్కొంది. డ్రమ్ ఎల్ ఈడీ 1.05 లక్షలు, డ్రమ్ వేరియంట్ ధర రూ. 95వేలకే లభిస్తుందని కంపెనీ తెలిపింది.

ఫీచర్ల వివరాలు

125 సీసీ ఇంజిన్ కలిగిన ఫ్రీడమ్ 125లో 2 కేజీల సీఎన్జీ ట్యాంక్, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. రెండూ కలిపి 330 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఇంజిన్ 9.5 పీఎస్ పవర్, 9.7 ఎన్ఎం టార్క్న్న ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ & పెట్రోల్ ట్యాంక్ ను సీటు కింద అమర్చారు. ఈ బైక్ 11 రకాల సేఫ్టీ టెస్టుల్లో పాస్ అయ్యిందని కంపెనీ తెలిపింది. ప్రమాదాలు జరిగినప్పుడు సీఎన్జీ లీక్ కాకుండా భద్రతా పరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సాధారణ పెట్రోల్ బైక్తో పోలిస్తే 50 శాతం తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఈ బైక్ నడుస్తుందని, కేవలం ఐదేళ్లలోనే రూ.75 వేల వరకు దీంతో ఆదా చేసుకోవచ్చని బజాజ్ ఆటో పేర్కొంది.

సీఎన్జీ & పెట్రోల్ మోడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది. బైక్ ను ఆపకుండానే ఫ్యూయెల్ ఆప్షన్ ను మార్చుకోవచ్చని తెలిపింది. బ్లూటూత్ కనెక్టివిటీతో కన్సోల్, మోనో షాక్ సస్పెన్షన్, పొడవైన సీటుతో ఈ బైక్ వస్తోంది. ఎల్రడీ రౌండ్ హెడ్ల్యాప్ అమర్చారు. బైక్ బుకింగ్లు తమ వెబ్సైట్లో ప్రారంభమయ్యాయని పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్లో తక్షణమే తీసుకొస్తామని, ఇతర రాష్ట్రాల్లో దశలవారీగా ఈ బైక్ లాను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది.

=====================

BIKE DETAILS

COMPARE VARIANTS

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags