AP: ‘Talliki
Vandanam’ & ‘Student Kits’ – Guidelines & Useful Documents - Details Here
ఏపీ: ‘తల్లికి వందనం’ & ‘స్టూడెంట్ కిట్‌లు’
– మార్గదర్శకాలు & ఉపయోగకరమైన పత్రాలు – వివరాలు ఇవే
===================
UPDATE
24-07-2024
'తల్లికి వందనం' గురించి శాసన మండలిలో క్లారిఫికేషన్
ఇచ్చిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
> 'తల్లికి వందనం' పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
నేడు (జులై 24) శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
> ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 'తల్లికి
వందనం' ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.
> ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని
తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు
చేస్తామన్నారు.
===================
UPDATE 12-07-2024
ఏపీ:
‘తల్లికి వందనం’ పథకం గురించి క్లారిఫికేషన్ ఇస్తూ పత్రికా ప్రకటన విడుదల
===================
School Education - Applying
for Sub AUA (Authentication user Agency) under Regulation 15 of Aadhaar
(Authentication) Regulation, 2016 Notification under section 7 of the Aadhaar
(Targetted Delivery of Financial and other subsidies, benefits and service)
Act, 2016(Act No.18 of 2016) for the schemes of "Talliki Vandanam"
"Student kits" etc. - Orders - Issued.
G.O.Ms.No. 29, Dated:09.07.2024
===================
ఏపీ లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే
విద్యార్థులు ‘తల్లికి వందనం‘, ‘స్టూడెంట్ కిట్' ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని
ప్రభుత్వం సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా
శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
‘తల్లికి వందనం’ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకు
లకు ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు.
విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని
పేర్కొన్నారు.
స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ, ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్, మూడు జతల ఏకరూప దుస్తులు, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్ లు, ఆంగ్ల నిఘంటువు ఇస్తున్నారు.
ఈ
రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ను కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా
లేకపోయినా.. విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు.
ఆధార్ వచ్చే వరకు ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, రేషన్ కార్డు, పాస్ పోర్టు, బ్యాంకు లేదా తపాలా పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్సు, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రం, విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని వెల్లడించారు.
===================
0 Komentar