Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Apara Annapurna - Dokka Seethamma - Biography

 

Apara Annapurna - Dokka Seethamma - Biography

అపర అన్నపూర్ణ - డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర

====================

ఒకప్పుడు డొక్కా సీతమ్మగారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం గురించి ఖండాంతరాల్లో నూ వ్యాపించింది. ఆమె గురించి ఈ కాలం వారు తెలుసుకోవలసిన విషయాలు ఇవే.

డొక్కా సీతమ్మగారు తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరంలో 1841 లో జన్మించింది. ఆమె తండ్రి అనప్పిండి భవానీ శంకరుడు... తల్లి నరసమ్మ. వీరి వంశం వారు ఇప్పటికీ లంకలగన్నవరంలో ఉన్నారు.

సీతమ్మ బాల్యం నుంచి వితరణ స్వభావం కలది. పుట్టినింటి వారు అంత సంపన్నులు కారు. సీతమ్మగారు ఉన్నంత లోనే పేదసాదలకు అన్నం పెట్టేది సాయం చేసేది. ఆమెభర్త డొక్కా జోగన్నగారు. అత్తింటివారు సంపన్నులు కావటంతో సీతమ్మగారు భర్త అనుమతితో దానధర్మాలు చేస్తూ ఉండేది.

అన్నదానం చేయడంలో ఈమెకు ఎక్కువ ప్రీతి. గొప్ప, బీద,జాతి, మత, కుల భేదాలు లేకుంగా ఏ వేళకు వచ్చి అన్నం అడిగినా లేదన కుండా, విసుక్కోకుండా వాళ్ళని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తి పరచేది. ఈ విషయంలో భర్త కూడా అమెకు అన్ని విధాలా సాయపడుతూ ఉండేవాడు.

సీతమ్మగారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు, గాథలు ఆంధ్రదేశంతో ప్రచారంలో ఉన్నాయి. సంతానం లేని ఒక జిల్లా కలెక్టరు సీతమ్మ గారి చేతి చలువ అన్నం వల్లనే తనకు సంతానం కలిగిందని విశ్వసించేవాడు, 'ధాత' కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాటు కవులు ఎన్నో విధాల ప్రసంసించారు.

ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా ముసురు పట్టి వర్షం కురుస్తోంది. దానికి తోడు గోదావం పొంగి ప్రవహిస్తోంది. ఒక హరిజనుడు గోదావరి లంకలో చిక్కుకుని, ఆకలితో అలమటిస్తూ గొంతెత్తి 'అమ్మా, సీతమ్మ తల్లి ఆకలి తో ప్రాణం పోతోందమ్మా - అన్నం పెట్టి పుణ్యం కట్టుకోమ్మా' అని ఆక్రోశిస్తున్నాడట. ఎలాగో ఆ ఆక్రోశం సీతమ్మగారి చెవుల పడింది. వెంటనే ఆమె బయలుదేరింది. ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కుండ నెత్తి మీద పెట్టుకుని భర్త సాయంతో ఆ లంక లోకి వెళ్ళి, ఆ హరిజనుడికి అన్నం పెట్టి, ఆకలి తీర్చి, అతడిని వెంటపెట్టుకు ని గోదావరి దాటించి తన ఇంటికి తీసుకు వచ్చి కాపాడింది.

ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారి ఇంటికి వచ్చి ఆమె పట్టు చీర దొంగిలించాడు. చుట్టు పక్కల వారు కనిపెట్టి, దొంగని పట్టుకుని కట్టేసి కొట్టబోయారు. సీతమ్మ గారు వారిని వారించి ఆ దొంగని కట్లు విప్పించి, వాడికి అన్నం పెట్టి ఆ పట్టు చీర తానే స్వయంగా ఆ దొంగకి ఇచ్చి పంపించిందట.

మరోసారి సీతమ్మగారు అంతర్వేది తీర్థానికి మేనాలో బయలుదేరింది. దారి లో పెళ్ళివారి గుంపు ఒకటి ఎదురైంది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ 'సీతమ్మగారు ఊళ్ళో లేదు. అమే వుంటే మనల్ని ఇలా అభోజనంగా పంపించేదా' అనుకుంటున్నారుట. సీతమ్మగారు అ మాటలు విని, మేనా దిగి వారి సంగతి కనుక్కుని, తాను వెనక్క తిరిగి ఆ పెళ్ళి వారిని వెంటపెట్టుకుని ఇల్లు చేరి అప్పటి కప్పుడు అంతమందికీ వంట చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది.

సీతమ్మగారి అన్నదాన వ్రతనిష్ఠును పరీక్షించడానికి ఒకరోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధరరావుగారు, తమ దివాను తో కూడా మారు వేషాలతో వెళ్ళి సీతమ్మ గారి ఇంటి వీధి అరుగు మీద పడుకున్నారుట. రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మగారు అరుగుల మీద కొత్త వారిని చూని లోపలికి వచ్చి భొజనం చేసి పడుకోండి' అన్నది. వారిద్దరు తమకు ఆరోగ్యం బాగాలేదని అన్నారుట. ఫరవా లేదు, మికు పథ్యంగానే వండిపెడతానని వాళ్ళని లోపలికి తీసుకువచ్చి ఆ రాత్రి వేళ పథ్యం వంట చేసి పెట్టిందిట సీతమ్మగారు.

సీతమ్మగారి అన్నదాన ప్రశస్తి అనాటి బ్రిటిషు చక్రవర్తి ఏడో ఎడ్వర్డ్ గారికి తెలిసింది. ఆయన ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ యోగ్యతా పత్రాన్ని పంపించారుట. అంతేకాకుండా ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం లండన్ లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో దర్బారు హాల్లో సీతమ్మ గారి ఫొటో పెట్టేందుకు ఆదేశించారుట. అలా ఆ ఫోటో కోసం ఒకే ఒక్కసారి కెమెరా ముందు కుర్చీలో కూర్చుని ఫోటో దిగారు సీతమ్మగారు.

అపర్ణ అన్నపూర్ణ అయిన డొక్కా సీతమ్మ గారు 1909 లో పరమపదించారు.  

====================

DOKKA SEETHAM HOUSE LOCATION

CLICK FOR BIOGRAPHY IN PDF FORM

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags