Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APSRTC: Passenger Friendly Conductor ParuchurI Sudhakar Rao Received Praise from Passengers & Minister

 

APSRTC: Passenger Friendly Conductor ParuchurI Sudhakar Rao Received Praise from Passengers & Minister

ఏపీఎస్ఆర్టీసీ: ప్రయాణీకులు & మంత్రి నుండి ప్రశంసలు అందుకున్న ప్యాసింజర్ ఫ్రెండ్లీ కండక్టర్ పరుచూరి సుధాకర్ రావు

======================

ఏపీ లోని తెనాలి ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పరుచూరి సుధాకరరావు చక్కటి మర్యాదకరమైన ప్రవర్తనతో మన్నన పొందుతున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కగానే 'మీరు ఆర్టీసీ బస్సు ఎక్కినందుకు ధన్యవాదాలు' అంటూ ఆయన మాటలు కలుపుతారు. టికెట్లు ఇస్తున్న క్రమంలో విసుగు లేకుండా నవ్వుతూ తన పని చేసుకుంటారు. మరి కొద్దినిమిషాల్లో ఫలానా స్టాప్ వస్తుందని గట్టిగా అందరికీ వినబడేలా చెబుతారు. బస్సు దిగుతున్న వారికి థ్యాంక్స్ చెబుతారు.

అంతేకాక సామాజిక మాధ్యమాల వేదికగా ఆర్టీసీ బస్సుల రాకపోకల సమాచారాన్ని పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణికుల మన్ననలు అందుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ఆయనకు ఫోన్ చేసి 'మీరు ఆర్టీసీకి చేస్తున్న సేవ చూశాను..చాలా బాగుంది' అంటూ అభినందనలు తెలిపారు.

తాజాగా, ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ కావడంతో సుధాకర్ రావు పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. ఆర్టీసీకి మీరు అందిస్తున్న సేవలు ముచ్చటగొలుపుతున్నాయని ప్రశంసించారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ప్రసాదరావు బస్సెక్కిన విద్యార్థులతో మాటలు కలిపారు. రవాణాశాఖమంత్రి ఎవరని వారిని ప్రశ్నించారు. తమకు తెలియదని వారు చెప్పడంతో రాంప్రసాద్ రెడ్డి అని, ఆయన కడప జిల్లా రాయచోటి నుంచి గెలిచారని పిల్లలకు చెప్పారు. ముఖ్యమంత్రిని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటారో, ప్రతి మంత్రిని అలానే గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. బస్సు దిగుతున్న పిల్లలు, ఇతర ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. ఆపై బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పారు.

======================

INSTAGRAM LINK

FACEBOOK LINK

YOUTUBE LINK

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags