Bank of Maharashtra Recruitment 2024: Apply
for 195 Officer Posts – Details Here
బ్యాంక్ ఆఫ్
మహారాష్ట్రలో 195 ఆఫీసర్ ఉద్యోగాలు - జీతం: నెలకు రూ.64,820 - రూ.1,56,500.
======================
మహారాష్ట్ర, పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. వివిధ విభాగాల్లోని 195 ఆఫీసర్ (స్కేల్: 2, 3, 4, 5, 6) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో
దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్మెంట్
2. ఫారెక్స్ అండ్ ట్రెజరీ
3. ఐటీ / డిజిటల్ బ్యాంకింగ్ / సీఐఎస్ఓ / సీడీఓ
4. క్రెడిట్, ఎకనామిస్ట్ తదితర విభాగాలు
మొత్తం
పోస్టుల సంఖ్య: 195
పోస్టుల
వివరాలు:
డిప్యూటీ
జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్
మేనేజర్,
మేనేజర్, అసిస్టెంట్ జనరల్
మేనేజర్,
చీఫ్ మేనేజర్, బిజినెస్
డెవెలప్మెంట్ ఆఫీసర్.
అర్హత:
సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు
స్కేల్-2 పోస్టులకు రూ.64,820-రూ.93,960,
స్కేల్-3కు రూ. 85,920 - రూ.1,05,280, స్కేల్-4కు రూ.1,02,300-రూ.1,20,940, స్కేల్-5కు రూ.1,20,940-రూ.1,35,020, స్కేల్-6 పోస్టులకు రూ.1,40,500-రూ.1,56,500.
ఎంపిక
విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు
ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118. ఇతరులకు రూ.1180.
దరఖాస్తు
విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్
మహారాష్ట్ర, హెచ్.ఆర్.ఎం డిపార్ట్మెంట్, హెడ్ ఆఫీస్, లోక్ మంగల్, శివాజీనగర్, పుణె
చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు
ప్రారంభం: 11-07-2024.
దరఖాస్తులకు
చివరి తేదీ: 26-07-2024.
======================
======================
0 Komentar