Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BSNL New Prepaid Plan: 395 Days Plan with More Benefits & Less Price - Details Here

 

BSNL New Prepaid Plan: 395 Days Plan with More Benefits & Less Price - Details Here

బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్: ఎక్కువ ప్రయోజనాలు & తక్కువ ధరతో 395 రోజుల ప్లాన్ - వివరాలు ఇవే

======================

బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా నూతన రీఛార్జ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. తాజాగా 13 నెలల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన ప్రైవేట్‌ టెలికం సంస్థలు భారీగా టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. జియోతో మొదలైన ధరల పెంపును ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ఐడియా కూడా కొనసాగించాయి. ఈ కంపెనీలన్నీ సుమారు 15 నుంచి 25 శాతం ఛార్జీలను పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ యూజర్లను ఆకర్షించే క్రమంలో సరికొత్త ప్లాన్స్‌ను తీసుకొస్తోంది.

ఈ ప్లాన్‌ ధర రూ. 2,399, అంటే నెలకు రూ. 200 కంటే తక్కువే అన్నమాట. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు దేశంలోని అన్ని నెట్‌వర్క్స్‌కి అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ పొందొచ్చు. వీటితో పాటు జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ ఆస్ట్రోటెల్ వంటి సేవలను కూడా ఉచితం యాక్సెస్ చేసుకోవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 365 రోజుల వ్యాలిడిటీతో మరో సూపర్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా రూ. 1999తో రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు 600 జీబీ డేటా పొందొచ్చు. వీటితో పాటు అదనంగా జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ ఎరీనా గేమ్స్, గేమన్ ఆస్ట్రోటెల్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ లెక్కన రోజుకు రూ .5.47 చెల్లిస్తారన్నమాట.

======================

ANDROID APP

iPHONE APP

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags