India at Paris
Olympics 2024: All the Details Here
పారిస్
ఒలింపిక్స్ 2024 లో భారత దేశం ప్రదర్శన పూర్తి వివరాలు
ఇవే
=====================
ఒలింపిక్స్ 2024 పోటీలు జులై 27 నుండి ప్రారంభం అయ్యాయి. ఈ సారి భారత్
నుంచి 117 మంది పోటీపడుతున్నారు. టోక్యో
ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలు సాధించింది. ఈ సారి ఎన్ని
పతకాలు వస్తాయో వేచి చూద్దాం.
=====================
=====================
===================
రోజు వారీగా ముఖ్యాంశాలు
– విజయాలు
===================
Day 14
– ఆగస్టు 9:
రెజ్లింగ్ లో అమన్ కి కాంస్యం – మొత్తం భారత దేశానికి ఇప్పటికి 6 పతకాలు (1 రజతం, 5 కాంస్యాలు)
రెజ్లింగ్:
• రెజ్లింగ్ స్టార్ అమన్ సెహ్రావత్
శుక్రవారం (AUGUST 9) కాంస్య పతకం సాధించాడు. 57
కిలోల కంచు పతక పోరులో అతడు 13- 5తో దరియన్ టోయ్ క్రజ్ (ప్యూర్టోరికో) ను
ఓడించాడు.
===================
Day 13
– ఆగస్టు 8:
జావెలిన్ లో నీరజ్
కి రజతం - హాకీ రూపం లో మరో కాంస్యం – మొత్తం భారత దేశానికి ఇప్పటికి 5 పతకాలు (1 రజతం,
4 కాంస్యాలు)
జావెలిన్
త్రో:
నీరజ్ చోప్రా మరోసారి గొప్ప ప్రదర్శన ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్ లో 89.45 మీటర్ల దూరం జావెలిన్ ని విసిరాడు. ఊహించని విధంగా పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి అతను స్వర్ణం ఎగరేసుకుపోవడంతో నీరజ్ రజతంతో సంతృప్తి చెందాడు. తొలి ప్రయత్నంలో వీళ్లిద్దరూ ఫౌల్ చేయగా.. రెండో ప్రయత్నంలో అర్షద్ సంచలన ప్రదర్శన చేశాడు. ఇప్పటిదాకా ఎప్పుడూ 90 మీటర్ల మార్కును అందుకోని నీరజ్.. 2వ ప్రయత్నంలో తన రెండో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను అందుకున్నాడు. అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్యం సాధించాడు.
హాకీ:
పారిస్
ఒలింపిక్స్-2024 లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన
కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్ పై గెలుపొందింది.
కెప్టెన్
హర్మన్ ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర
పోషించాడు. దీంతో ఈ ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.
రెజ్లింగ్:
• పురుషుల 57 కేజీల కేటగిరీ లో అమన్
సెహ్రావత్ ప్రీ-క్వార్టర్ & క్వార్టర్ ఫైనల్
లో గెలిచి సెమీ ఫైనల్ కి చేరాడు. కానీ సెమీ ఫైనల్ లో ఓటమి చెందాడు. కావున నేడు (ఆగస్టు
9) కాంస్య పతక మ్యాచ్ ఆడనున్నాడు.
===================
Day 12 – ఆగస్టు 7:
రెజ్లింగ్:
• వినేశ్ ఫోగాట్ 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్ – నియమాల ప్రకారం తన బరువు 100 గ్రాములు ఎక్కువ ఉండటం వల్ల వినేశ్ ని అనర్హురాలు గా ప్రకటించారు.
===================
Day 11 – ఆగస్టు 6:
హైలైట్స్: భారత్
కి నాలుగవ పతకం ఖాయం - 50 కేజీల రెజ్లింగ్
పోటీలో ఫైనల్ కి చేరిన వినేశ్ ఫోగాట్ - క్వాలిఫికేషన్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే ఫైనల్
రౌండ్ చేరిన నీరజ చోప్రా
జావెలిన్
త్రో:
• పురుషుల
జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ లో నీరజ్ చోప్రా శుభారంభం చేశాడు. క్వాలిఫికేషన్
రౌండ్ తొలి ప్రయత్నంలోనే జావెలిన్ ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ కి చేరాడు. ఆగస్టు 8న రాత్రి 11:55 గంటలకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
మన దేశానికి చెందిన
మరో జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనా ఫైనలు చేరుకోలేకపోయాడు.
రెజ్లింగ్:
• వినేశ్
ఫోగాట్ 50 కేజీల రెజ్లింగ్ లో ప్రిక్వార్టర్ ఫైనల్ & క్వార్టర్
ఫైనల్ రెండిటిలో గెలిచి సెమీ ఫైనల్ కి చేరింది.
సెమీ ఫైనల్ లో విజయం సాధించి ఫైనల్ కి చేరింది. దీంతో భారత్ కి నాలుగవ పతకం
(స్వర్ణం లేదా రజతం) ఖాయం అయ్యింది.
హాకీ:
• పురుషుల జట్టు జర్మనీ తో సెమీ ఫైనల్ లో ఓటమి – ఆగస్టు 8 న కాంస్య పతక మ్యాచ్.
===================
Day 10 – ఆగస్టు 5:
బ్యాడ్మింటన్:
• పురుషుల
సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్ లో లక్ష్య సేన్ ఓటమి చెందాడు. దీనితో నాలుగవ స్థానం పొందారు.
టేబుల్ టెన్నిస్:
• మహిళల జట్టు
ప్రీ-క్వార్టర్ ఫైనల్ లో గెలిచి క్వార్టర్ ఫైనల్ కి చేరారు.
===================
Day 9 – ఆగస్టు 4:
హైలైట్స్: భారత హాకీ జట్టు
సెమీ ఫైనల్ కి – బ్యాడ్మింటన్ లో లక్ష్య సేన్ కి కాంస్య పతకం వచ్చే అవకాశం
హాకీ:
భారత జట్టు క్వార్టర్
ఫైనల్ లో గ్రేట్ బ్రిటన్ పై గెలిచి సెమీ ఫైనల్ కి చేరుకుంది.
బ్యాడ్మింటన్:
• పురుషుల
సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో లక్ష్య సేన్ ఓటమి చెందాడు. కానీ కాంస్య పతకం కోసం మరో
మ్యాచ్ లో రేపు (ఆగస్టు 5) ఆడాల్సి ఉంది.
===================
Day 8 – ఆగస్టు 3:
షూటింగ్:
• మను బాకర్
25 మీ మహిళల పిస్టల్ కేటగిరీ లో ఫైనల్ రౌండ్ లో 4వ పొజిషన్ తో సరిపెట్టుకోవాల్సి
వచ్చింది.
ఆర్చరీ:
• దీపికా కుమారి మహిళల కేటగిరీ లో ప్రీ-క్వార్టర్ ఫైనల్ లో గెలిచి క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ విజయాన్ని అందుకోలేకపోయింది.
===================
Day 7 – ఆగస్టు 2:
హైలైట్: మను
బాకర్ కి మూడో పతకానికి అవకాశం – బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ లో లక్ష్య
సేన్
షూటింగ్:
• మను బాకర్ 25
మీ మహిళల పిస్టల్ కేటగిరీ లో క్వాలిఫికేషన్ రౌండ్ లో విజయం సాధించి ఫైనల్ రౌండ్ కి
చేరింది.
బ్యాడ్మింటన్:
• పురుషుల
సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో లక్ష్య సేన్ విజయం సాదించి సెమీ ఫైనల్ కి
చేరాడు.
ఆర్చరీ
మిక్స్డ్
కేటగిరీ లో ధీరజ్ & అంకిత ప్రీ-క్వార్టర్ ఫైనల్ మరియు క్వార్టర్ ఫైనల్ లో
విజయం సాదించి సెమీ ఫైనల్ కి చేరుకున్నారు. కానీ ఆ తర్వాత సెమీ ఫైనల్ & కాంస్య
పతక మ్యాచ్ లలో ఓటమి పొంది 4 వ స్థానం పొందారు.
హాకీ:
భారత జట్టు ఆస్ట్రేలియా
మీద గెలిచి క్వార్టర్ ఫైనల్ కి చేరింది.
===================
Day 6 – ఆగస్టు 1:
షూటింగ్ లో మూడో
కాంస్య పతకం
షూటింగ్:
• భారత్ కు మరో
పతకం షూటింగ్ కేటగిరీ లో వచ్చింది. యువ షూటర్ స్వప్నిల్ పురుషుల 3 పొజిషన్ షూటింగ్
ఫైనల్లో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.
బ్యాడ్మింటన్
• పురుషుల
సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో లక్ష్య సేన్ మన దేశానికి చెందిన ప్రణయ్
హెచ్.ఎస్. మీద విజయం సాదించి క్వార్టర్ ఫైనల్ కి చేరారు.
===================
Day 5 - జులై 31:
బ్యాడ్మింటన్:
• మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ లో పి. వి. సింధు మరో మ్యాచ్ లో గెలిచి క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది.
• పురుషుల
సింగిల్స్ గ్రూప్ స్టేజ్ లో లక్ష్య సేన్ & ప్రణయ్ హెచ్.ఎస్. ఇద్దరు రెండో మ్యాచ్ లో విజయం సాదించి ప్రీ-క్వార్టర్ ఫైనల్
కి చేరారు. ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వీరిద్దరే నేడు (ఆగస్టు 1) ఆడనున్నారు.
That lightning-fast backhand shot by an ice-cold Lakshya Sen is a moment of pure sporting magic, destined to be etched in memories of fans for years to come!#LakshyaSen #Badminton #makingindiaproud #Paris2024 #ParisOlympics #TeamIndia pic.twitter.com/esA1qjKMD0
— The Better India (@thebetterindia) July 31, 2024
షూటింగ్:
• స్వప్నిల్ కుసలే 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ క్వాలిఫికేషన్ రౌండ్ లో విజయం సాదించి ఫైనల్ రౌండ్ కి చేరుకున్నాడు.
టేబుల్ టెన్నిస్:
• మహిళల సింగిల్స్ కేటగిరీ లో శ్రీజ ఆకుల రెండవ రౌండ్ లో విజయం సాదించింది.
బాక్సింగ్
• మహిళల 75 కేజీల
ప్రీ-క్వార్టర్ లో లవ్లీనా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది.
• పురుషుల 71
కేజీల ప్రీ-క్వార్టర్ లో నిశాంత్ దేవ్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కి చేరుకున్నాడు.
ఆర్చరీ:
• దీపికా కుమారి రెండు మ్యాచ్ లు గెలిచి ప్రీ-క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది.
===================
Day 4 - జులై 30:
షూటింగ్ 10 మీ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ కేటగిరీ లో కాంస్యం – ఒకే ఒలింపిక్
లో రెండు పతకాలు గెలిచిన మను బాకర్
షూటింగ్:
• ఒలింపిక్స్ 2024 లో భారత్ కు రెండో పతకం దక్కింది. యువ షూటర్ మను బాకర్ మరియు
సరబ్ జ్యోత్ సింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్
కేటగిరీ లో కాంస్య పతకం సాధించారు. ఒకే ఒలింపిక్స్ లో షూటింగ్ లో రెండు పతకలు సాధించిన
తొలి భారత మహిళా షూటర్ గా మను బాకర్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో కొరియా పై
16-10 తో విజయం సాధించి కాంస్య పతాకాన్ని అందుకున్నారు.
ఆర్చరీ:
• భజన్ కౌర్ రెండు
మ్యాచ్ లు గెలిచి ప్రీ-క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది.
బ్యాడ్మింటన్:
• పురుషుల
డబుల్స్ గ్రూప్ స్టేజ్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ మరో మ్యాచ్ గెలిచి క్వార్టర్ ఫైనల్ కి చేరుకున్నారు.
హాకీ:
• భారత్ మూడో
మ్యాచ్ లో ఐర్లాండ్ పై 2-0 తో గెలిచింది.
==================
Day 3 - జులై 29:
బ్యాడ్మింటన్:
• పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ లో మొదటి మ్యాచ్ లో లక్ష్య సేన్ తో ఆడిన కెవిన్ కోర్డన్ విత్ డ్రా చేసుకోవడం వల్ల లక్ష్య సేన్ గ్రూప్ స్టేజ్ మరోసారి మొదటి మ్యాచ్ జూలియన్ కరాగీ తో ఆడి విజయం సాదించాడు.
హాకీ:
• రెండవ మ్యాచ్
లో అర్జెంటీనా తో ఆడిన భారత్ 1-1 తో డ్రా గా ముగించింది.
షూటింగ్:
• 10 మీ
ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ కేటగిరీ లో మను బాకర్ మరియు సరబ్ జ్యోత్ సింగ్ క్వాలిఫయింగ్
రౌండ్ మూడవ ర్యాంక్ సాదించారు. నేడు (జులై 30) కాంస్య పతకం కోసం అడనున్నారు.
టేబుల్ టెన్నిస్:
• మహిళల సింగిల్స్
కేటగిరీ లో మనిక బాత్ర రెండవ రౌండ్ లో విజయం సాదించింది.
===================
Day 2 - జులై 28:
భారత్ కు తొలి పతకం సాధించిన మను బాకర్
షూటింగ్:
ఒలింపిక్స్ 2024
లో భారత్ కు తొలి పతకం దక్కింది. యువ షూటర్ మను బాకర్ 10మీ ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్ లో
షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ సృష్టించింది. ఫైనల్లో మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా షూటర్లు
ఓహ్ యే జిన్ (243. 2 పాయింట్లు) స్వర్ణం, కిమ్ యేజే (241.3 పాయింట్లు) రజతం గెలిచారు.
• పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ కేటగిరీలో అర్జున్ బబుత ఫైనల్ రౌండ్ కి చేరారు.
• మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ కేటగిరీలో రమిత జిందాల్ ఫైనల్ రౌండ్ కి చేరారు.
బ్యాడ్మింటన్:
• మహిళల సింగిల్స్
గ్రూప్ స్టేజ్ లో పి. వి. సింధు మొదటి మ్యాచ్ లో విజయం సాదించింది.
• పురుషుల
సింగిల్స్ గ్రూప్ స్టేజ్ లో ప్రణయ్ హెచ్.ఎస్. మొదటి మ్యాచ్ లో విజయం
సాదించాడు.
బాక్సింగ్:
• మహిళల 50 కేజీల కేటగిరీ లో నిఖత్ జరీన్ మొదటి రౌండ్ లో విజయం
సాదించారు.
టేబుల్ టెన్నిస్:
• మహిళల సింగిల్స్
కేటగిరీ లో శ్రీజ ఆకుల మరియు మనిక బాత్ర మొదటి రౌండ్ లో విజయం సాదించారు.
===================
Day 1 - జులై 27:
షూటింగ్:
• మను బాకర్ 10
మీ ఎయిర్ పిస్టల్ కేటగిరీ లో క్వాలిఫికేషన్ రౌండ్ లో విజయం సాధించి ఫైనల్ రౌండ్ కి
చేరింది.
బాడ్మింటన్:
• పురుషుల
సింగిల్స్ గ్రూప్ స్టేజ్ లో లక్ష్య సేన్ మొదటి మ్యాచ్ లో విజయం సాదించాడు.
• పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ మొదటి మ్యాచ్ లో విజయం సాదించారు.
బాక్సింగ్:
• మహిళల 54 కేజీలు కేటగిరీ లో ప్రీతీ పవార్ మొదటి రౌండ్ లో విజయం సాదించారు.
హాకీ:
• పురుషుల
గ్రూప్ బి లో న్యూజిలాండ్ పై భారత్ 3-2 తో
విజయం సాదించింది.
టేబుల్ టెన్నిస్:
• పురుషుల సింగిల్స్ లో హర్మీత్
దేశాయ్ ప్రిలిమినరీ రౌండ్ లో 4-0 తో విజయం సాధించారు.
====================
CLICK
FOR PLAYERS LIST WITH SPORTS CATEGORY
===================
UPDATE 17-07-2024
విశ్వ
క్రీడాసంబరం ఒలింపిక్స్ ఈనెల 26 నుంచే ప్రారంభం
కానుంది. పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా క్రీడలు నిర్వహించడానికి ఏర్పాట్లు
పూర్తయ్యాయి. ఈసారి భారత్ 117 మంది అథ్లెట్లను ఒలింపిక్స్ కి
పంపుతోంది. ఇందుకు సంబంధించిన జాబితాకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆమోదం
తెలిపింది. అథ్లెట్లతోపాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా పారిస్ కు వెళ్లనుంది.
భారత
అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా 11 మహిళ, 18 మంది పురుష
క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీమ్ 21, హాకీ జట్టులో 19 మంది ఉన్నారు.
టేబుల్ టెన్నిస్ (8), బ్యాడ్మింటన్ (7), రెజ్లింగ్ (6), ఆర్చరీ (6), బాక్సింగ్ (6), గోల్ఫ్ (4), టెన్నిస్ (8), స్విమ్మింగ్ (2), సెయిలింగ్ (2), ఈక్వస్ట్రియన్, జుడో, రోయింగ్, వెయింట్ లిఫ్టింగ్ విభాగంలో ఒక్కొక్కరు పోటీపడుతున్నారు.
2021లో జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ లో సువర్ణాధ్యాయాన్ని
లిఖించిన నీరజ్ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్ లోనూ
పతకాల ఆశలు రేపుతున్న క్రీడాకారులు చాలామందే ఉన్నారు. భారత్ బృందానికి చెఫ్ దే
మిషన్గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్
తరఫున టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ తోపాటు మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు
పతాకధారిగా వ్యవహరించనున్నారు.
=====================
0 Komentar