Meta AI: Chatbot Available Now on
WhatsApp – How to use Meta AI Individually and Group Chats
మెటా ఏఐ: చాట్‌బాట్ ఇప్పుడు వాట్సప్ లో - ఎలా ఉపయోగించాలి? మరియు గ్రూప్ లో
కూడా ఎలా వాడాలో తెలుసుకోండి?
=====================
వాట్సప్
ఓపెన్ చేస్తే చాలు. అంతేకాదు.. ఏదైనా లెటర్ రాయాలన్నా, రెజ్యూమె ప్రిపరేషన్ లో టిప్స్ కావాలన్నా ఇకపై వాట్సప్ ని అడిగితే
చాలు.. కావాల్సిన సమాచారం మీ ముందు ఉంచుతుంది. ఇందుకోసం వాట్సప్ మాతృసంస్థ మెటా..
మెటా ఏఐని (Meta AI) తీసుకొచ్చింది.
ఏమిటీ మెటా
ఏఐ, ఎలా ఉపయోగించుకోవాలి?
వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మెటా
సంస్థ ఈ ఏఐని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వాట్సప్ లో ఇప్పటికే చాలామందికి ఈ
ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు కుడివైపు కింది భాగంలో ఒక రింగ్
లాంటి సింబల్ దర్శనమిస్తుంది. ఐఫోన్ యూజర్లకు అయితే డిస్ప్లే పైభాగంలో కెమెరా
ఐకాన్ పక్కన ఈ ఆప్షన్ కనిపిస్తుంది. వెబ్ వాట్సప్ లోనూ ఈ సదుపాయాన్ని
వినియోగించుకోవచ్చు. మీ ప్రొఫైల్ పిక్ పక్కనే కనిపిస్తుంది.
ఎలా వాడాలి?
> వాట్సప్
లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ఏఐ
సదుపాయంతో మనకు కావాల్సిన సమాచారం క్షణాల్లో తెలుసుకోవచ్చు.
> అందుకోసం
రింగులాంటి సింబల్ పై క్లిక్ చేస్తే చాలు ఒక చాట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
> దాంట్లోకి
వెళ్లి మీకు కావాల్సిన అంశాన్ని వెతకొచ్చు. ఉదాహరణకు ప్రభాస్ కొత్త చిత్రం 'కల్కి' కలెక్షన్ల గురించి
తెలుసుకోవాలనుకుంటే చాలు.. ఆ అంశాన్ని సెర్చ్ చేస్తే చాలు. ఆ వివరాలను మీ
ముందుంచుతుంది.
> ఆన్లైన్
దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే రిఫరెన్సు లింకులను కూడా ఇస్తుంది.
వాట్సప్ గ్రూప్
లో మెటా ఏఐ ని ఎలా ఉపయోగించాలి?
> మీరు మెటా
ఏఐ ని ఉపయోగించాలనుకుంటున్న గ్రూప్ చాట్‌ని తెరవండి.
> మెసేజ్ చేయాల్సిన
ఫీల్డ్‌లో @ అని టైప్ చేసి, ఆపై Meta AI క్లిక్ చేయండి.
> నిబంధనలను
చదివి అంగీకరించండి. ఎంటర్ క్లిక్ చేయండి.
> మెటా ఏఐ యొక్క రిప్లయ్ చాట్‌లో ప్రదర్శించబడుతుంది.
=====================
0 Komentar