Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Paris Olympics 2024: Check the 117 Indian Athletes and Event Categories

 

Paris Olympics 2024: Check the 117 Indian Athletes and Event Categories

పారిస్ ఒలింపిక్స్ 2024: ఒలింపిక్స్ లో పాల్గొనే 117 మంది భారతీయ అథ్లెట్ల వివరాలు మరియు ఈవెంట్ కేటగిరీ ల వివరాలు ఇవే

=====================

విశ్వ క్రీడాసంబరం ఒలింపిక్స్ ఈనెల 26 నుంచే ప్రారంభం కానుంది. పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా క్రీడలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి భారత్ 117 మంది అథ్లెట్లను ఒలింపిక్స్ కి పంపుతోంది. ఇందుకు సంబంధించిన జాబితాకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అథ్లెట్లతోపాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా పారిస్ కు వెళ్లనుంది.


భారత అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా 11 మహిళ, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీమ్ 21, హాకీ జట్టులో 19 మంది ఉన్నారు. టేబుల్ టెన్నిస్ (8), బ్యాడ్మింటన్ (7), రెజ్లింగ్ (6), ఆర్చరీ (6), బాక్సింగ్ (6), గోల్ఫ్ (4), టెన్నిస్ (8), స్విమ్మింగ్ (2), సెయిలింగ్ (2), ఈక్వస్ట్రియన్, జుడో, రోయింగ్, వెయింట్ లిఫ్టింగ్ విభాగంలో ఒక్కొక్కరు పోటీపడుతున్నారు.



2021లో జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ లో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నీరజ్ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్ లోనూ పతకాల ఆశలు రేపుతున్న క్రీడాకారులు చాలామందే ఉన్నారు. భారత్ బృందానికి చెఫ్ దే మిషన్గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ తరఫున టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ తోపాటు మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు పతాకధారిగా వ్యవహరించనున్నారు.

=====================

CLICK FOR PLAYERS LIST WITH SPORTS CATEGORY

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags