Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRB Recruitment 2024: Apply for 7951 Junior Engineer & Other Posts – Details Here

 

RRB Recruitment 2024: Apply for 7951 Junior Engineer & Other Posts – Details Here

రైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్ &, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు జీతభత్యాలు రూ.35,400 – రూ.44,900.

======================

భారతీయ రైల్వే లో దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 03/ 2024) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్ ఖాళీలు భర్తీ కానున్నాయి.

ఆర్ఆర్బి రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్ పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్కతా, మాల్టా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.

వివరాలు:

1. కెమికల్ సూపర్వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రిసెర్చ్: 17 పోస్టులు (ఆర్ఆర్బీ గోరఖ్పూర్ మాత్రమే)

2. జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 7,934 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 7,951.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు: కెమికల్ అండ్ మెటలర్జికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ తదితరాలు.

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు.

ప్రారంభ వేతనం (నెలకు):

జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: రూ.35,400.

కెమికల్ సూపర్వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రిసెర్చ్: రూ.44,900.

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ మహిళలు / ట్రాన్స్ జెండర్లకు రూ.250 .

దరఖాస్తు ప్రక్రియ: ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.07.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.08.2024.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags