Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Union Budget 2024-25: Highlights & Key Features – Budget Details Here for AP

 

Union Budget 2024-25: Highlights & Key Features – Budget Details Here for AP

యూనియన్ బడ్జెట్ 2024-25: కీలక ప్రకటనలు - నిర్మలా సీతారామన్ ప్రసంగం బడ్జెట్ అధికారిక ‘కీ’ ఫీచర్ల ఫైల్ - బడ్జెట్ ఆండ్రాయిడ్ యాప్

======================

నేడు జులై 23 న కేంద్ర బడ్జెట్ (Union Budget)ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  పార్లమెంటు లో ప్రవేశపెట్టారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ ను రూపొందించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన- ఆవిష్కరణలు, తయారీ-సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు సీతా రామన్ ప్రకటించారు.

కేంద్ర బడ్జెట్ లో కీలక ప్రకటనలివే..

1. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ. 75 వేలకు పెంపు. కొత్త పన్ను విధానం శ్లాబుల్లో మార్పులు. సున్నా నుంచి రూ. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.

2. మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు. బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6 శాతానికి తగ్గింపు. ప్లాటినమ్ పై  6.4శాతానికి కుదింపు.

3. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల

నిర్మాణం. అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు.

4. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం.

5. ముద్రా రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు

6. ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను తీసుకొచ్చే ప్రణాళిక. 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు.

7. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ. 500 పెద్ద కంపెనీల్లో

ఇంటర్న్ షిప్ లు.  

8. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు.

9. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపు. జీడీపీలో ఇది 3.4 శాతానికి సమానం.

10. మహిళలు, బాలికల కోసం రూ.3 లక్షల కోట్లతో పథకాలు. విద్య, ఉపాధి, నైపుణ్యాలభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు

11. ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్ ఏర్పాటు. రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలు.

12. కొత్త ఉద్యోగులకు మూడు ప్రోత్సాహకాలు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ. లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు. దీనివల్ల 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుంది.

13. పీఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతలు ఏర్పాటు.

14. క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ. దీర్ఘకాల లాభాలపై 12.5 శాతం పన్ను. స్టార్టప్లకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు.

ఆంధ్ర ప్రదేశ్ కి సంభందించిన బడ్జెట్ వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు.

ఈ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ..

ఈ సందర్భంగా విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తాం" అని నిర్మలమ్మ చెప్పారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు.

విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ -బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ - చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని తెలిపారు.

======================

SPEECH OF NIRMALA SITHARAMAN

KEY FEATURES OF BUDGET 2024-25

KEY TO THE BUDGET 2024-2025

BUDGET AT A GLANCE

BUDGET ANDROID APP

BUDGET iOS APP

BUDGET WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags