Wimbledon Women’s Final 2024:
Barbora Krejčíková defeats Jasmine
Paolini for First Wimbledon Title
వింబుల్డన్ మహిళల
సింగిల్స్ ఫైనల్ 2024: తొలి వింబుల్డన్ టైటిల్ & రెండవ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా
క్రెజికోవా
======================
అనూహ్య
ఫలితాలతో సాగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ కొత్త ఛాంపియన్ గా క్రెజికోవా (చెక్
రిపబ్లిక్) అవతరించింది. ఫైనల్ మ్యాచ్ లో పావోలిని (ఇటలీ) పై 6-2, 2-6, 6-4 తేడాతో విజయం
సాధించింది. 1 గంట 56 నిమిషాలపాటు ఈ
పోరులో తొలి సెట్లో క్రెజికోవా ఆరంభం నుంచి దూకుడు కొనసాగించి ఆధిక్యంలో
నిలిచింది. రెండో సెట్ లో మాత్రం పావోలిని దూకుడు ప్రదర్శించింది. అత్యుత్తమ
ఆటతీరుతో సెట్ ను సొంతం చేసుకుంది.
మూడో సెట్
హోరాహోరీగా సాగింది. చివరకు చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి విజయం సాధించి వింబుల్డన్
కొత్త రాణిగా నిలిచింది. వింబుల్డన్ ఫైనల్ చేరడం క్రెజికోవా, పావోలినికి ఇదే తొలిసారి. తాజా విజయంతో క్రెజికోవా రెండవ గ్రాండ్
స్లామ్ సొంతం చేసుకుంది.
2021 ఫ్రెంచ్ ఓపెన్ నూ క్రెజికోవా విజేతగా నిలిచింది. 2016లో సెరెనా విలియమ్స్ టైటిల్ గెలిచిన తర్వాత జరిగిన ప్రతి
వింబుల్డన్లోనూ మహిళల సింగిల్స్ లో కొత్త ఛాంపియన్ పుట్టుకొచ్చారు. ఈ సారి కూడా
అదే ఆనవాయితీ కొనసాగింది.
======================
A dream realised ✨
— Wimbledon (@Wimbledon) July 13, 2024
Barbora Krejcikova is a #Wimbledon singles champion for the first time, defeating Jasmine Paolini 6-2, 2-6, 6-4 🇨🇿 🏆 pic.twitter.com/k15QgL7Buz
0 Komentar