Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

World Population Day (July 11): Theme, History and Significance

 

World Population Day (July 11): Theme, History and Significance

ప్రపంచ జనాభా దినోత్సవం (జులై 11): ప్రాధాన్యం, చరిత్ర మరియు ఇతివృత్తం

=====================

ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కులు వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

=====================

ఇతివృత్తం (Themes)

2024: ‘Leave no one behind, count everyone’.

2023: ‘Unleashing the power of gender equality: Uplifting the voices of women and girls to unlock our world’s infinite possibilities.'

2022: “'A World of 8 Billion: Towards a Resilient Future for All — Harnessing Opportunities and Ensuring Rights and Choices for All.'”

2021: “Right and Choices are the Answer: Whether baby boom or bust, the solution to shifting fertility rates lies in prioritising all people’s reproductive health and rights”

==================

చరిత్ర (History)

యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ గవర్నింగ్ కౌన్సిల్  ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించింది. ఏ రోజున ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తారో, ఆ రోజున (1987 జూలై 11న) దీనిని జరపాలని నిర్ణయించింది. దీనిని కొనసాగించాలని 1990లో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ తీర్మానం చేసింది. అధిక జనాభా ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపింది.

==================

World Population Density:

ప్రాధాన్యం (Significance)

కుటుంబ నియంత్రణ, పౌర హక్కులు, పేదరికం, మానవాళిపై అధిక జనాభా చూపే ప్రభావం గురించి ప్రజలకు వివరించడానికి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారత దేశం నిలిచింది. అధిక జనాభా కారణంగా కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది.

Conclusion

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 2030 ఎజెండా అనేది ఆరోగ్యవంతమైన భూ మండలంపై ప్రజలందరికీ మెరుగైన భవిష్యత్తుకు ప్రపంచ బ్లూప్రింట్ అని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. జనాభా వృద్ధి, వృద్ధాప్యం, వలసలు, పట్టణీకరణ సహా జనాభా ధోరణులతో ఈ మిషన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గుర్తిస్తున్నట్లు తెలిపారు.

Current Population Details (2024) - Approx

India: 144 Crores

World: 812 Crores

WORLD POPULATION LINK

INDIA POPULATION LINK

==================

ఏంటి దాని ప్రాధాన్యం? ఎందుకు జరుపుకోవాలి?

జనాభా పెరుగుదలపై చర్చించేందుకు ఓ రోజు ఉంటే మంచిదే. మన అభివృద్ధీ, ప్రపంచ గమనం, ప్రాజెక్టులు, కార్యక్రమాలూ అన్నీ ఆధారపడేది జనాభా పైనే. అపరిమిత జనాభా వల్ల వనరులు తగ్గిపోతున్నాయి.

గత 30 ఏళ్లుగా మనం ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. జులై 11న జనాభా పెరుగుదల, ఫలితంగా జరిగే పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకుంటున్నాం. 1989లో ఐక్య రాజ్య సమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రోజున మనం జనాభా పెరుగుదల వల్ల కలిగే సమస్యలకు పరిష్కారాలపై చర్చించుకుంటాం. 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. అందుకే అప్పటి నుంచీ జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే... మానవ వనరులు అత్యవసరం. అలాగే ఏ దేశమైనా తిరోగమనం చెందేందుకు కూడా మానవ వనరులు కారణం అవుతున్నాయి. అందువల్ల జనాభా అనే వనరును సక్రమంగా ఉపయోగించుకోకపోతే, ప్రపంచ గమనానికే ముప్పు తప్పదన్నమాట.

ఏ దేశమైనా పెరిగిన జనాభాకు తగిన ఉద్యోగాలు, ఆహారం, ఆవాసం, సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. వీటిలో ఏవి తగ్గినా... పరిస్థితి అల్లకల్లోలంగా తయారవుతుంది. జపాన్ లాంటి ఎక్కువ భూమి లేని దేశాలకు జనాభా ఎప్పుడూ భారమే. చైనాలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికీ... అందుకు తగినంత భూమి, వనరులు ఉండటం... మానవ వనరుల్ని ఆ దేశం సక్రమంగా వినియోగిస్తుండటంతో... చైనాకు జనాభా కలిసొస్తోంది. ఇండియా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ... మానవ వనరుల్ని సక్రమంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐతే... ఇండియా ఈ దిశగా చేయాల్సింది చాలా ఉందన్నది నిపుణుల మాట.

ఓవరాల్‌గా జనాభా పెరిగితే... వనరులు తగ్గిపోతాయి. ఇప్పటికే చాలా దేశాల్లో చమురు నిల్వలు అడుగంటిపోయాయి. నీటికి విపరీతమైన కొరత ఏర్పడుతోంది. కరవు, కాటకాల్ని చూస్తున్నాం. ఆఫ్రికా దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అంతర్యుద్ధాలు, ఆక్రమణలు ఉండనే ఉన్నాయి. ఇక ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారింది. ఇవన్నీ అశాంతి వల్ల తలెత్తే పరిణామాలు. ఈ అశాంతికి కారణాల్లో జనాభా పెరుగుదల కూడా ఒకటిగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు జనాభా సంఖ్య పెరుగుదలపై దృష్టి సారిస్తూనే... వనరుల్ని సక్రమంగా వినియోగించే అంశాలపైనా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది.

2010లో ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది. ప్రస్తుతం భూమిపై 800 కోట్లకు పైగా ప్రజలున్నారు. వీరిలో చైనా, ఇండియా కలిపి... 250 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఐతే... 2050 నుంచీ ప్రపంచ జనాభా సంఖ్య తగ్గుతుందనే అంచనాలున్నాయి. ముఖ్యంగా చైనా, ఇండియాలో అభివృద్ధి, విదేశీ సంస్కృతుల కారణంగా... ప్రజలు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపరనీ, ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోందనీ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో... ఈ ఆలోచనా ధోరణి మరింత ఎక్కువై... జనాభా పెరుగుదల తగ్గి... తిరోగమనంలోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే... అందరికీ మంచిదే.

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags