70 Years - 70 Feet Khairatabad Ganesh - ‘Sri
Sapthamukha Maha Shakti Ganapathi’ - Details Here
ఖైరతాబాద్
గణనాథుడు 2024: 70వ ఏడాది
70 అడుగుల ' శ్రీ సప్తముఖ
మహాశక్తి గణపతి’ గా గణనాథుడు - నమూనా ఫొటో ఇదే
=======================
గణేష్
నిమజ్జనోత్సవం-2024 ప్రత్యెక్ష ప్రసారం | LIVE : Ganesh
Immersion -2024
=======================
=======================
మహాగణపతి
పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్లను తీర్చిదిద్దడంతో ఉత్సవ కమిటీ తొలిసారిగా ఆగమన్
కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక యువకులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆగమన్ పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
=======================
ఖైరతాబాద్ గణపతి
గురించి అందరకు తెలిసిందే. ఈ ఏడాది తో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ సారి
కనిపించే ఖైరతాబాద్ మహాగణపతి ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా
దర్శనమివ్వనున్నారు.
సప్తముఖాల
ప్రత్యేకతలు ఇవే
ఏడు పడగల
ఆదిశేషుడి నీడలో సప్తముఖాలతో ఖైరతాబాద్ మహాగణపతి కనిపిస్తారు. కుడివైపు ముఖాల్లో
బ్రహ్మ,
విష్ణు, మహేశ్వరులు, ఎడమవైపు ముఖాల్లో సరస్వతి, లక్ష్మి, పార్వతి అమ్మవార్లు ఉంటారు. అలాగే
రెండు వైపులా సప్తహస్తాలతో విభిన్నమైన ఆయుధాలను ధరించి స్వామి వారు దర్శనమిస్తారు.
కుడివైపు చక్రం, పాశం, త్రిశూలం, పద్మం, శంఖం,
అభయహస్తం, ఎడమ వైపు
రుద్రాక్షమాల, పాశం, గ్రంథం, వీణ, కమలం,
గధ, మరో చేతిలో (మొదక
హస్తం) ప్రసాదాన్ని పట్టుకొని ఉంటారు. స్వామి వారి కుడివైపు అయోధ్య బాలరాముడు, ఎడమవైపు రాహు, కేతుల
విగ్రహాలు, స్వామి వారి వాహనం మూషికం ఉంటాయి.
వీటితో పాటు ఉప మండపాల్లో శ్రీ శ్రీనివాసుడు, లక్ష్మి
కల్యాణంలో క్షీరసాగర మథనం, శ్రీ
పార్వతీపరమేశ్వరుల కల్యాణంలో బ్రహ్మ, విష్ణు, నారద మహర్షిని వీక్షించవచ్చు.
ఎత్తు: 70 అడుగులు
స్వామి వారి
విగ్రహం 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో దర్శనమిస్తారు. వీటితో పాటు కుడివైపు పది అడుగుల అయోధ్య
బాలరాముడి విగ్రహం, ఎడమ వైపు తొమ్మిది
అడుగుల ఎత్తులో రాహు, కేతుల విగ్రహాలు, మూడు అడుగుల మూషికాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కుడి వైపు 15 అడుగుల మండపంలో తొమ్మిది అడుగుల ఎత్తులో లక్ష్మి, శ్రీనివాసుడి విగ్రహాలు, ఎడమవైపు
మండపంలో అంతే ఎత్తులో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
సప్త
మాత్రుకల శక్తి స్వరూపుడై..
బ్రహ్మణి, చాముండా, మహేశ్వరి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, వైష్ణవి
సప్తమాత్రుకలు. పురాణేతిహాసాల ప్రకారం ఆ సప్తమాత్రుకలు ఉద్భవించడానికి శ్రీ మహా
గణపతి మూల కారణంగా చెబుతారు. అంతేకాకుండా కాలమానంలో ఏడు రోజులు, ఈ సంవత్సరం వినాయక చవితి ఏడో శనివారం, ఏడో తేదీ (సెప్టెంబర్ 7)న ఉండటంతో
పాటు ఏడు పగడలతో అదిశేషుడి నీడలో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా (ప్రధాన విగ్రహంతో
కలిపి) ఏడు ముఖాలతో ప్రతిష్ఠిస్తుండటం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రజలు, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని, పాలకులు మంచి పాలన అందించేందుకు సప్తమాత్రుకలు శక్తిని ప్రసాదించాలన్న
సంకల్పంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.
=======================
=======================
0 Komentar