Knowing Aadhaar Enrolment Centres is now
easy with Bhuvan Aadhaar Portal – Details Here
భువన్ ఆధార్
పోర్టల్‌తో ఆధార్ నమోదు కేంద్రాలను తెలుసుకోవడం ఇప్పుడు సులభతరం – వివరాలు ఇవే
====================
ఆధార్ నమోదు కేంద్రాలు
ఎక్కడున్నాయో తెలుసుకోవడం పెద్ద సమస్యే. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆధార్
కేంద్రాన్ని వెతకడం అంటే ఓ సవాలే. ఈ సమస్యను పరిష్కరించడం కోసమే భారత విశిష్ట
ప్రాధికార సంస్థ (UIDAI) ఇస్రోతో చేతులు
కలిపింది. ఇస్రో అనుబంధంగా పనిచేసే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)తో కలిసి 'భువన్ ఆధార్ (Bhuvan Aadhaar)'
అనే పోర్టల్ ను ప్రారంభించారు.
దీనిద్వారా
ఆధార్ కార్డుహోల్డర్లు మూడు రకాల ప్రీమియం ఫీచర్లను పొందొచ్చు. దగ్గర్లో ఉన్న
ఆధార్ కేంద్రాలను తెలుసుకోవడంతో పాటు వాటి దగ్గరకు వెళ్లేందుకు మార్గం, ఏ పరిసరాల్లో ఉందో మ్యాప్ లో చూపే ఫీచర్లను ఈ పోర్టల్ అందిస్తోంది.
ఈ పోర్టల్లోకి
స్క్రీను ఎడమ వైపున మీకు నాలుగు డ్రాప్-డౌన్ ఆప్షన్లు కనిపిస్తాయి.
1. దగ్గర్లోని
ఆధార్ నమోదు కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లలో 'సెంటర్స్ నియర్బై'ను ఎంపిక
చేసుకోండి. వెంటనే మీకు దగ్గర్లోకి కేంద్రాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
2. పిన్
కోడ్ ఎంటర్ చేయడం ద్వారా కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో
తెలుసుకోవచ్చు.
3. రాష్ట్రం, జిల్లా, మండలం.. వంటి
వివరాలను ఎంటర్ చేసి ఆయా రాష్ట్రాల్లోని ఆధార్ కేంద్రాల వివరాలన్నింటినీ
చూసుకోవచ్చు.
4. మీకు
ప్రత్యేకంగా ఒక ఆధార్ సేవా కేంద్రం పేరు తెలిస్తే 'సెర్చ్ బై ఆధార్ సేవా కేంద్ర' అనే ఆప్షన్ ను కూడా
ఉపయోగించుకోవచ్చు.
====================
====================
0 Komentar