AP: Anna Canteen - List of 100 Canteens Details
- Menu and Timing Details Here - Opening Ceremony
ఏపీ: అన్న క్యాంటీన్ - మెనూ మరియు టైమింగ్ వివరాలు ఇవే - నేడు&రేపు (15&16) 100 క్యాంటీన్‌ల ప్రారంభోత్సవం – 100 క్యాంటీన్‌ల జాబితా ఇదే
====================
Hon'ble CM of AP will Inaugurate Anna
Canteen, Participate in Lunch with Beneficiaries
YouTube Link:
https://www.youtube.com/watch?v=jFpJpUAzPI4
====================
====================
ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబు గుడివాడలో మొదటి అన్న క్యాంటీన్ ను నేడు (ఆగస్టు 15) ప్రారంభించారు.
మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు.
శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి
రానున్నాయి. 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని
మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి
తీసుకురానున్నారు.
అన్న క్యాంటీన్లలో
మెను (Menu) ఇదే:
• సోమవారం
నుంచి శనివారం వరకు రోజూ ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ-చట్నీ/పొడి, సాంబార్ అందిస్తారు.
• ఇడ్లీతోపాటు
సోమవారం,
గురువారం పూరీ, కుర్మా, మంగళవారం, శుక్రవారం ఉప్మా, చట్నీ, బుధవారం, శనివారం పొంగల్-చట్నీ, మిక్చర్
అందుబాటులో ఉంటాయి. ఇడ్లీ వద్దనుకునే వారు ప్రత్యామ్నాయంగా పూరీ, ఉప్మా, పొంగల్ తీసుకోవచ్చు.
• సోమవారం
నుంచి శనివారం వరకు రోజూ మధ్యాహ్నం, రాత్రి
అన్నంతోపాటు కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి అందిస్తారు.
• తాగునీటి
సౌకర్యం,
ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు.
• ఆదివారం
క్యాంటీన్లకు సెలవు. వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు.
• ఆహార
పరిమాణం: ఇడ్లీ/పూరి 3, ఉప్మా, పొంగల్ 250 గ్రాములు, అన్నం 400 గ్రాములు, చట్నీ/పొడి 15 గ్రాములు, పప్పు 120 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు ఇస్తారు.
====================
క్యాంటీన్లు
తెరిచి ఉంచే సమయం (Time Table):
అల్పాహారం: ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు,
మధ్యాహ్న భోజనం: 12.30 నుంచి 3 గంటల వరకు,
రాత్రి: 7.30 నుంచి 9 గంటల వరకు.
====================
అన్న క్యాంటీన్ విరాళాల కొరకు బ్యాంక్ వివరాలు (DONATIONS):
రాష్ట్రవ్యాప్తంగా
అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించిన సందర్భంగా పేదలకు పట్టెడన్నం పెట్టే మంచి
కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రజలు అన్న క్యాంటీన్లకు డిజిటల్ విరాళాలివ్వొచ్చని చంద్రబాబు చెప్పారు. విరాళాలు
అందజేసేందుకు ఏర్పాటు చేసిన బ్యాంక్ ఖాతా నెంబరు, ఇతర వివరాలను ఆయన వెల్లడించారు.
SBI Bank Name-ANNA CANTEENS A/C
37818165097 IFSC - SBIN0020541 Branch - Chandramouli Nagar City, Guntur.
====================
0 Komentar