AP Cabinet Meeting Highlights – 07/08/2024
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 07/08/2024
=====================
Cabinet Decisions - Press Briefing by
Hon'ble Minister for I&PR, Housing at Publicity Cell
LIVE - ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి "I &PR శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=Y0rTM-fBu9w
=====================
ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో పలు కీలక
నిర్ణయాలపై చర్చించారు.
ఏపీ కేబినెట్
కీలక నిర్ణయాలు ఇవే:
> రెవెన్యూ
శాఖలో మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని, క్యూఆర్ కోడ్ తో కూడిన పాస్ బుక్ లు ఇస్తామని వెల్లడించారు.
> రాష్ట్రంలో
అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు
చేస్తామన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని తెలిపారు.
> దేశంలో
ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని.. ఏపీలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపై చర్చ
జరిగిందని పేర్కొన్నారు.
> “స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే
అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిబంధన ఎత్తివేసేలా
చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
> మావోయిస్టులపై
మరో ఏడాది నిషేధం విధించేలా క్యాబినెట్ తీర్మానం చేసింది.
> మత్స్యకారుల
ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న 217 జీవోను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించాం” అని పార్థసారథి తెలిపారు.
> "నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త వైద్య కళాశాలల్లో గతంలో మంజూరైన
పోస్టులకు అదనంగా మరో 380 పోస్టులు భర్తీ
చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించింది.
> ఫేజ్- 2కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన వైద్య కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించడానికి
చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
> గుజరాత్
లో ఉన్న పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం సంబంధిత శాఖల మంత్రులు, అధికారుల్ని ఆదేశించారు” అని వెల్లడించారు.
> "జీవో నంబర్ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మే 11, 2023న జారీ చేసిన జీవో 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ.. దాన్ని తిరిగి నీటిపారుదల
శాఖకు బదలాయించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం. ఈ భూమిని అన్ని చట్టాలను
పరిగణనలోకి తీసుకొని శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన
మాస్టర్ ప్లాను వినియోగించుకోవాలని సూచన.
> రాష్ట్రంలో
సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండటంపై చర్చించాం. రాష్ట్ర భవిష్యత్తులో యువత జనాభా
తగ్గిపోనుంది.
> ఎక్సైజ్
శాఖ మెరుగైన విధానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న
విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించాం” అని మంత్రి పార్థసారథి వివరించారు.
=====================
0 Komentar