AP Teacher (Asst Professor): Question Paper
Themed Wedding Invitation – Details Here
ఏపీ: టీచర్
(అసిస్టెంట్ ప్రొఫెసర్): ప్రశ్నాపత్రం రూపం లో వివాహ ఆహ్వాన పత్రిక – వివరాలు ఇవే
======================
ప్రస్తుతం పెళ్లిల
సమయం. ఇక కొన్ని పెళ్ళిళ్ళ లో ఏదో ఒక విషయం లో సృజనాత్మకత తో వారి వారి ప్రత్యేకతలు చూపిస్తా ఉంటారు.
ఆంధ్ర ప్రదేశ్
లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన
నార్కెడమిల్లి చెందిన ప్రత్యూష అధ్యాపకురాలు. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్
ప్రొఫెసర్ గా చేస్తున్నారు. అక్కడే పరిచయమైన ఫణీంద్రతో ఆమె వివాహం నిశ్చయమైంది.
క్వశ్చన్ పేపర్
రూపం లో పెళ్ళి పత్రిక:
ప్రత్యూష గారి
వివాహం ఈనెల 23న జరగనుంది. స్థానిక వేణుగోపాలస్వామి
ఆడిటోరియంలో జరిగే ఈవివాహానికి బంధు, మిత్రులను
ఆహ్వానించేందుకు వివాహ పత్రికలను ముద్రించే విషయంలో తన ప్రత్యేకతని చూపింది.
స్వతహాగా టీచర్
(ప్రొఫెసర్) అయిన తాను వివాహం చేసుకోబోయే వరుడి ఫోటో తో మొదటి ప్రశ్న ఆ తర్వాత మరో
7 ప్రశ్నల వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించింది. పెళ్లికార్డు విషయంలోనూ కాస్త
సృజనాత్మకత జోడించాలనుకున్నారు. అది తన వృత్తికి సంబంధించినది అయితే బాగుంటుందని
భావించిన ఆవిడ పెళ్లి వివరాలతో ఓ ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. దానిలో ప్రశ్న-
సమాధానం,
స్పెల్లింగ్ సరిచేయడం, బహుళైచ్ఛిక
ప్రశ్న,
తప్పు- ఒప్పు... ఇలా భిన్నవిధానాల్లో 8 ప్రశ్నలను సమాధానాలతో సహా సిద్ధం చేశారు. వరుడు, వధువు, కన్యాదానం చేసే వారి
పేర్లు,
పెళ్లి తేదీ, ముహూర్తం, వేదిక, విందుకు సంబంధించిన
వివరాలన్నీ ఆ ప్రశ్న-జవాబుల్లోనే వచ్చేలా చేసి, ముద్రణ
చేయించారు.
======================
0 Komentar