Cricket: Thrilling T20 Game Sets World
Record with 3 Super Overs – Check the Highlights Here
క్రికెట్: T20 క్రికెట్ లో 3 సూపర్
ఓవర్లతో ప్రపంచ రికార్డు – మ్యాచ్ మరియు హైలైట్స్
వివరాలు ఇవే
======================
T20 ఫార్మాట్
లో ఇరు జట్లు సమాన స్కోరు సాధించినప్పుడు విజేతను తేల్చడానికి సూపర్ ఓవర్
నిర్వహిస్తుంటారు. కొన్నిసార్లు రెండు సూపర్ ఓవర్ల తో ఫలితం తేలిన సందర్భాలూ
ఉన్నాయి. కానీ, టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఏకంగా మూడు సూపర్ ఓవర్లను
నిర్వహించాల్సి వచ్చింది. కర్ణాటక ప్రీమియర్ లీగ్ అయిన 'మహారాజా టీ20 ట్రోఫీ లో
భాగంగా బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది.
ఆగస్టు 23, 2024
న జరగయిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన మయాంక్ అగర్వాల్
నేతృత్వంలోని బెంగళూరు బ్లాస్టర్స్ చివరి బంతికి రనౌట్ అవడంతో స్కోరు సమమైంది.
మొదటగా జరిగిన
సూపర్ ఓవర్ లో ఇరు జట్లు 10 పరుగులు చేయగా..
మళ్లీ టై అయ్యింది. దీంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు. రెండవ సూపర్ ఓవర్లలోను
బెంగళూరు,
హుబ్లీ జట్లు సమానంగా 8 పరుగుల
చొప్పున చేశాయి. దీంతో మూడోసారి టై బ్రేకర్ నిర్వహించక తప్పలేదు. మూడో సూపర్
ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 12 పరుగులు చేసింది. ఛేదనలో హుబ్లీ ఆటగాడు మన్వంత కుమార్ చివరి బంతికి ఫోర్
కొట్టి 13
పరుగులతో జట్టును గెలిపించాడు.
======================
======================
0 Komentar