Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DME AP Recruitment 2024: Apply for 488 Assistant Professors - Details Here

 

DME AP Recruitment 2024: Apply for 488 Assistant Professors - Details Here

ఏపీ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే 

======================

ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్... ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్ / లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 9వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

1. అసిస్టెంట్ ప్రొఫెసర్- బ్రాడ్ స్పెషాలిటీస్ (క్లినికల్/ నాన్ క్లినికల్)

2. అసిస్టెంట్ ప్రొఫెసర్- సూపర్ స్పెషాలిటీస్

మొత్తం పోస్టుల సంఖ్య: 488.

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎండీ, ఎంసీ హెచ్) ఉత్తీర్ణులై ఉండాలి.

స్పెషాలిటీ: సీటీ సర్జరీ, కార్డియాలజీ, ఎండోకైనాలజీ, మెడికల్ జీఈ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్టి, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, టీబీ & సీడీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మాకాలజీ, ఎస్ పీఎం.

వయోపరిమితి: ఓసీలకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్/ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1000(బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500).

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.09.2024.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags