GATE - Graduate Aptitude Test in
Engineering - 2025 – All the Details Here
గేట్ -
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ – 2025 – పూర్తి వివరాలు ఇవే
=====================
భారత్ లోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్ లో ప్రవేశానికి నిర్వహించే 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)- 2025' పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. ఈసారి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ
బాధ్యత ఐఐటీ రూర్కీ చేపట్టింది. వెబ్సైట్తో పాటు దరఖాస్తు తేదీలను తాజాగా
అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 30 సబ్జెక్టుల్లో
పరీక్షలు జరగనున్నాయి.
గ్రాడ్యుయేట్
ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2025:
అర్హతలు:
ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు:
అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు
విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
పరీక్ష నిర్వహించే ప్రాంతాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూల్, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం
తెలంగాణలో
పరీక్ష నిర్వహించే ప్రాంతాలు: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల
ప్రారంభ తేదీ: 28-08-2024.
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 26-09-2024.
పరీక్ష
తేదీలు: 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీలు
=====================
=====================
0 Komentar