India at Paris Paralympics 2024: All the
Details Here
పారిస్ పారాలింపిక్స్ 2024 లో భారత దేశం ప్రదర్శన పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 09-09-2024
పారాలింపిక్స్-2024 భారత్ - రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించిన భారత్
2020 టోక్యో పారాలింపిక్స్ లో 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించిన భారత్, 2024 లో 25 పతకాలపై గురి పెట్టింది. మొత్తం 84 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. మన అథ్లెట్లు అంచనాలను
మించి అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత్ రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించింది.
మొత్తం గా 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో
18వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్
అత్యధిక పతకాలు సాధించడం ఇదే తొలిసారి.
పతకాలు
సాధించిన అథ్లెట్ల వివరాలు ఇవే:
1) అవని లేఖరా - స్వర్ణం (షూటింగ్) మహిళల 10 మీ ఎయిర్
రైఫిల్ SH1)
2) మోనా అగర్వాల్ - కాంస్యం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్
రైఫిల్ SH1)
3) ప్రీతి పాల్ - కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 100మీ T35
4) మనీశ్ నర్వాల్ - రజతం (షూటింగ్) పురుషుల ఎయిర్ పిస్టల్ SH1
5) రుబీనా ఫ్రాన్సిస్ - కాంస్యం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్పిస్టల్ SH1
6) ప్రీతి పాల్ - కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 200మీ T35
7) నిషాద్ కుమార్ - రజతం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T47
8) యోగేశ్ కతునియా - రజతం (అథ్లెటిక్స్) పురుషుల డిస్కస్ త్రో F56
9) నితేష్ కుమార్ - స్వర్ణం (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL3
10) తులసిమతి మురుగేశన్ - రజతం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5
11) మనీశా రామదాస్ - కాంస్యం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SU5
12) సుహాస్ యతిరాజ్ - రజతం (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ SL4
13) రాకేశ్ కుమార్/శీతల్ దేవి - కాంస్యం (ఆర్చరీ) ఆర మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్
14) సుమిత్ అంటిల్ - స్వర్ణం (అథ్లెటిక్స్) జావెలిన్ త్రో ఎఫ్64
15) నిత్య శ్రీ శివన్ - కాంస్యం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ SH6
16) దీప్తి జీవాంజీ - కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 400 మీటర్ల టీ20
17) శరద్ కుమార్ - రజతం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63 (అథ్లెటిక్స్)
18) మరియప్పన్ తంగవేలు - కాంస్యం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ63
19) అర్జీత్ సింగ్ - రజతం (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F46
20) గుర్జర్ సుందర్ సింగ్ - కాంస్యం (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F46
21) సచిన్ ఖిలారీ - రజతం (అథ్లెటిక్స్) పురుషుల షాట్పుట్ ఎఫ్6
22) హర్విందర్ సింగ్ - స్వర్ణం (ఆర్చరీ) పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్
23) ధరంబీర్ సింగ్ - స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51
24) ప్రణవ్ - రజతం (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51
25) కపిల్ పర్మార్ - కాంస్యం (జూడో) పురుషుల -60 కేజీల జే1
26) ప్రవీణ్ కుమార్ - స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ T64
27) హొకాటో హొటోజి సెమా - కాంస్యం (అథ్లెటిక్స్) పురుషుల షాట్పుట్ ఎఫ్57
28) సిమ్రాన్ - కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 200 మీటర్ల టీ12
29) నవదీప్ సింగ్ - స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో F41
====================
====================
2024
పారాలింపిక్స్ క్రీడలు పారిస్ లో ప్రారంభమయ్యాయి. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, ప్రముఖ నటుడు జాకీ చాన్ పారాలింపిక్స్ జ్యోతితో సందడి
చేశారు. దేశవిదేశాల నుంచి అధికసంఖ్యలో క్రీడాభిమానులు తరలివచ్చారు. వేడుకల్లో
భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 11 రోజుల పాటు సాగే పారాలింపిక్స్ లో 168 దేశాలకు చెందిన మొత్తం 4,400 క్రీడాకారులు పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 8న ఈ క్రీడలు ముగుస్తాయి.
భారత్ తరపున 84 మంది అథ్లెట్లు బరిలో ఈసారి నిలిచారు. ఇంత మందితో
పారాలింపిక్స్ లో పాల్గొనడం ఇదే తొలిసారి. గతంలో 54 మంది క్రీడాకారులు టోక్యోకి వెళ్లారు. ప్రారంభ వేడుకల్లో పారాలింపిక్స్ స్వర్ణ
పతక విజేత సుమిత్ అంటిల్, ఆసియా పారా క్రీడల
రజత పతక విజేత భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. గతంలో
టోక్యోలో జరిగిన పోటీల్లో భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో 24 స్థానంలో నిలిచింది.
====================
0 Komentar