Krishnashtami /
Janmashtami – Why and How Do We Celebrate
కృష్ణాష్టమి
/ జన్మాష్టమి – ఈ పండుగ ఎందుకు మరియు ఎలా జరుపుకుంటారు -తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవే
======================
కృష్ణాష్టమి
/ జన్మాష్టమి – ఈ ఏడాది 2024, ఆగస్టు 26 ఉదయం 3:39
గంటలకు ప్రారంభం అయ్యి ఆగస్టు 27 ఉదయం 2:19 గంటలకు ముగుస్తుంది.
======================
శ్రీ
మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని
కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు కృష్ణాష్టమి
నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం
శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి
నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ
రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో
ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా
‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు.
ప్రతి ఏడాది లో
శ్రావణ మాసం లో వచ్చే బహుళ అష్టమి రోజున, రోహిణి
నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన
స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు
పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం
కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట
నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా
కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం
ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసుకోవాలి.
ఈ శ్రావణమాసంలో
వచ్చే కృష్ణాష్టమి పండగకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి పండగ
రోజు చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు. అసలు కృష్ణాష్టమికి
ఉట్లు ఎందుకు కొడతారో చాలా మందికి తెలియదు. ఇదో ధర్మసందేహంగా ఉంటుంది. సాధారణంగా
శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురి ఇళ్లలోకి ప్రవేశించి పాలు, పెరుగును దొంగతనం చేసేవాడు. అయితే ఆ రోజుల్లో బుల్లి
కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ పాలు, పెరుగు ఉట్టిలో పెట్టి అందకుండా పైన కట్టేవాళ్లు. అయితే
కృష్ణుడు చాలా చిలిపిగా తన స్నేహితులను ఒంగోబెట్టి వాళ్లపైకి ఎక్కి ఉట్టిలోని పాలు, పెరుగును దొంగతనం చేసి తినేవాడు.
కృష్ణుడి
గురించి పలువురికి చాటిచెప్పేందుకు, ముఖ్యంగా
ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకు కృష్ణుడి జన్మదినమైన రోజు
ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలకొట్టి సంతోషిస్తుంటారు.ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా
కృష్ణాష్టమి ఈ విధంగా జరుపుకుంటున్నారు.
======================
0 Komentar