Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIRF Ranking 2024: IIT Madras Tops Again in Ministry of Education’s India Rankings 2024

 

NIRF Ranking 2024: IIT Madras Tops Again in Ministry of Education’s India Rankings 2024

వరుసగా ఆరవ ఏడాది ఉత్తమ విద్యా సంస్థ గా ఐఐటీ మద్రాస్ – NIRF ర్యాంకులను విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ

======================

2024 సంవత్సరానికి సంబంధించి విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

1. మొత్తం విద్యాసంస్థల కేటగిరీ (Overall):  

తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఐఐటీ మద్రాస్‌ వరుసగా 6వసారి అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. రెండు, మూడు స్థానాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, ఐఐటీ-బాంబే నిలిచాయి. కాగా టాప్ 10 విద్యాసంస్థల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గౌహతి, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ తొలి పది స్థానాలో నిలిచాయి.

2. విశ్వ విద్యాలయాల కేటగిరీ (Universities):  

ఉత్తమ విశ్వ విద్యాలయాల విభాగం లో వరుసగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు కు తొమ్మిదవ సారి తొలి స్థానం దక్కింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా రెండవ , మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి.   

3. కళాశాలల విభాగం (Colleges):  

ఉత్తమ కళాశాలల విభాగం లో దిల్లీలోని హిందూ కాలేజీ, మిరాండా కాలేజీ, సెయింట్ స్టీఫెన్ కాలేజీ టాప్-3లో ఉన్నాయి.

4. ఇంజనీరింగ్ విభాగం (Engineering):

ఇంజనీరింగ్ విభాగంలో మొదటి స్థానాన్ని ఐఐటీ (మద్రాస్) కైవసం చేసుకుంది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే తరువాతి స్థానాల్లో నిలిచాయి. 8వ స్థానంలో ఐఐటీ (హైదరాబాద్), 21వ స్థానంలో ఎన్ఐటీ (వరంగల్) నిలిచాయి.

5. మేనేజ్‌మెంట్‌ విభాగం (Management):

మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్‌ తొలి స్థానంలో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజీకోడ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

6. ఫార్మసీ విభాగం (Pharmacy):

ఫార్మసీ విభాగంలో జామియా హమ్‌దర్ద్‌ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌, బిట్స్‌ పిలానీ రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి.

7. న్యాయ విద్య విభాగం (Law):

న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని - నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఈ ఏడాది కొత్తగా చేర్చిన కేటగిరీలు ఇవే

8. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలు (State Public Universities)

చెన్నైలోని అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆరు, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఏడు స్థానాలు దక్కించుకున్నాయి.

9. ఓపెన్ యూనివర్సిటీ (Open University)

ఈ విభాగంలో ఇగ్నోకి ప్రథమ స్థానం లభించగా, నేతాజీ సుభాష్ యూనివర్సిటీ కోల్కతా, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అహ్మదాబాద్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

10. నైపుణ్య విశ్వవిద్యాలయం (Skill University)

పూణే కి చెందిన సింబయాసిస్ స్కిల్స్ & ప్రొఫెషనల్ యూనివర్సిటీ, హర్యానా కి చెందిన శ్రీ విశ్వకర్మ నైపుణ్య విశ్వవిద్యాలయం, రాజస్థాన్ కి చెందిన భారతీయ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం టాప్-3 లో నిలిచాయి. 

======================

CLICK FOR OVERALL RANKINGS

CLICK FOR UNIVERSITIES RANKINGS

CLICK FOR COLLEGES

CLICK FOR COMPLETE RANKING REPORT

Previous
Next Post »
0 Komentar

Google Tags