Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric Launches Electric Motorcycles - Price and Feature Details Here

 

Ola Electric Launches Electric Motorcycles - Price and Feature Details Here

ఓలా ఎలక్ట్రిక్ నుంచి మూడు వేరియంట్ లతో మొదటి మోటార్ బైక్ విడుదల – ధర & ఫీచర్ల వివరాలు ఇవే

======================

ఓలా ఎలక్ట్రిక్ రోడ్స్టర్' పేరిట మోటార్ సైకిల్ ను భారత మార్కెట్లో కి విడుదల చేసింది. ప్రస్తుతం విద్యుత్ స్కూటర్లు మాత్రమే విక్రయిస్తున్న ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి మోటార్ సైకిల్ ఇదే. ఈ మోటార్ సైకిల్ ధర రూ. 74,999 నుంచి ప్రారంభం అవుతుంది. రోడ్ స్టర్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. రోడ్ స్టర్ (Roadster), రోడ్స్టర్ ఎక్స్ (Roadster X), రోడ్ స్టర్ ప్రో (Roadster Pro) పేరిట లభిస్తుంది.

======================

1. రోడ్ స్టర్ ఎక్స్ (Roadster X)

రోడ్ స్టర్ సిరీస్లో అందుబాటు ధరలో లభించే వేరియంట్ ఇది. ఇందులో మూడు బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. 2.5kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.74,999గా కంపెనీ నిర్ణయించింది. ఇక 3.5kWh వేరియంట్ ధర రూ.85,999 కాగా.. 4.5kWh వేరియంట్ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. సింగిల్ ఛార్జ్ ఇది గరిష్ఠంగా 200 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుందని, దీని టాప్ స్పీడ్ 124 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ 4.3 అంగుళాల టచిన్తో వస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే.. వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

======================

2. రోడ్ స్టర్ (Roadster)

రోడ్స్టర్ ప్రారంభ (3.5kWh) ధర రూ.1.04 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 4.5kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ.1,19,999 కాగా.. 6kWh బ్యాటరీ ప్యాక్ ధరను రూ.1,39,999గా కంపెనీ పేర్కొంది. ఈ మోటార్ సైకిల్ డెలివరీలు కూడా జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బైక్ టాప్ స్పీడ్ 126 కిలోమీటర్లు. 3.5kWh బ్యాటరీ ప్యాక్ 151km, 4.5 kWhతో 190 కిలోమీటర్లు, 6kWh బ్యాటరీతో 248 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 6.8 అంగుళాల టీఎఫీ ఎల్సీడీ టచ్ డిస్ప్లే ఇస్తున్నారు.

===================== 

3. రోడ్ స్టర్ ప్రో (Roadster Pro)

రోడ్లస్టర్ సిరీస్లో హై ఎండ్ వేరియంట్ ఇది. ఈ బైక్ టాప్ స్పీడ్ 194 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. 9 kWh బ్యాటరీ ప్యాక్ వస్తున్న బైక్ ధర రూ.1.99 లక్షలు కాగా.. 16kWh బ్యాటరీ ప్యాక్ వస్తున్న ధర రూ.2.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ డెలివరీలు 2025 దీపావళి నుంచి ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ సింగిల్ ఛార్జ్ 579 కిలోమీటర్లుగా పేర్కొంది. ఇందులో 10 అంగుళాల టీఎఫ్ ఎల్సీడీ టచ్ డిస్ప్లే ఉంటుంది.

======================

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags