SBIF Asha Scholarship Program 2024 –
Details Here
ఎస్బీఐ ఆశా
స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 – పూర్తి వివరాలు ఇవే
======================
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రతిభ కలిగి ఆర్థిక ఇబ్బందులున్న విద్యార్థులకు
స్కాలర్ షిప్ అందిస్తోంది. ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్ షిప్ పేరుతో
ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6వ తరగతి నుంచి
పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 నుంచి 7.5 లక్షల వరకు స్కాలర్ షిప్ గా అందిస్తారు.
అర్హతలు: ఆరో
తరగతి నుంచి 12వ తరగతి వరకు; డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎంలో చదువుతున్న
భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్షిప్ నకు దరఖాస్తులు చేసుకోవచ్చు. గత విద్యా
సంవత్సరంలో విద్యార్థులు కనీసం 75% మార్కులు సాధించి
ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ.3లక్షలు
మించకూడదు.
ఏటా అందే
స్కాలర్షిప్:
> ఆరో
తరగతి నుంచి 12వ తరగతి వరకు
చదువుతున్న విద్యార్థులకు రూ.15,000.
> అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.50,000.
> పోస్ట్
గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.70,000.
> ఐఐటీ
విద్యార్థులకు రూ.2 లక్షలు.
> ఐఐఎం (ఎంబీఏ/ పీజీడీఎం) విద్యార్థులకు రూ.7.50 లక్షలు.
ఎంపిక
ప్రక్రియ: అకడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితి
ఆధారంగా ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. వచ్చిన దరఖాస్తులను అర్హతల ఆధారంగా
షార్టిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. షార్టిస్ట్ చేసిన
అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు
ఖాతాల్లోకి నేరుగా స్కాలర్షిప్ మొత్తాన్ని జమ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2024.
======================
======================
0 Komentar