SSC Recruitment
2024: Apply for 312 Hindi Translator Posts – Details Here
ఎస్ఎస్సీ
రిక్రూట్మెంట్ 2024: జూనియర్ & సీనియర్ హిందీ ట్రాన్సలేటర్లు మరియు జూనియర్ & సీనియర్
ట్రాన్స్ లేటర్లు
=====================
మొత్తం ఖాళీలు:
312 – జీత భత్యాలు: నెలకు రూ.35400 - రూ.142400.
కేంద్ర
ప్రభుత్వ విభాగాల్లో హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్
ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్
ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించే
రాత పరీక్షకు సంబంధించిన 'కంబైన్డ్ హిందీ ట్రాన్స్ లేటర్స్
ఎగ్జామినేషన్ 2024' ప్రకటనను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల
చేసింది. దీని ద్వారా 312 ఖాళీలను భర్తీ
చేయనున్నారు.
కంబైన్డ్
హిందీ ట్రాన్స్ లేటర్స్ ఎగ్జామినేషన్ 2024:
1. జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (JHT)
2. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ (JTO)
3. జూనియర్ ట్రాన్స్ లేటర్ (JT)
4. సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (SHT)
5. సీనియర్ ట్రాన్స్ లేటర్ (ST)
మొత్తం
పోస్టుల సంఖ్య: 312.
అర్హతలు:
పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ/ ఇంగ్లిష్). డిగ్రీ స్థాయిలో హిందీ/
ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్లేషన్(హిందీ/
ఇంగ్లిష్) డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ
సంస్థలో ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు
ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ/ పీజీ (హిందీ/ఇంగ్లిష్)
అర్హతతోపాటు తగు అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ సబ్జెక్టు
పాఠ్యాంశంగా ఉండాలి.
వయోపరిమితి: 01.08.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు
ఉంటాయి.
జీత భత్యాలు:
నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్/ సీనియర్ ట్రాన్స్ లేటర్ పోస్టులకు రూ.44900 - రూ.142400. ఇతర పోస్టులకు రూ.35400 - రూ.112400.
దరఖాస్తు
రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు
ఉంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 02.08.2024
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 25.08.2024.
ఎలా దరఖాస్తు
చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 8 ని చూడండి.
=====================
=====================
0 Komentar