Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG: Job Calendar 2024-25 Released – Details Here

 

TG: Job Calendar 2024-25 Released – Details Here

తెలంగాణ 2024-25 జాబ్ క్యాలెండర్ విడుదల – పలు రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల మరియు పరీక్షల నిర్వహణ నెలల వివరాలు ఇవే

====================

తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఏడాదికి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయనున్నారో క్యాలెండర్ వివరించారు.

నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపర్చారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు.

====================

> వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల – నవంబర్ లో పరీక్షలు.

> ట్రాన్స్ కో లోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్ లో నోటిఫికేషన్ -  వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు.

> టెట్ నోటిఫికేషన్ నవంబర్ లో విడుదల – వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు.

> వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల – ఏప్రిల్ లో పరీక్షలు

> డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల – ఏప్రిల్ లో పరీక్షలు.

> ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ - మేలో పరీక్షలు

> గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు.

> ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల - ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు.

> డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్ లో నోటిఫికేషన్ – సెప్టెంబర్ లో పరీక్షలు.

> గ్రూపు2 నోటిఫికేషన్ వచ్చే ఏడాది మేలో మరోసారి -  అక్టోబర్ లో పరీక్షలు.

> గ్రూప్-3 నోటిఫికేషన్ వచ్చే ఏడాది జులైలో – నవంబర్ లో పరీక్షలు.

> సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్ – నవంబర్ లో పరీక్షలు.

===================

DOWNLOAD JOB CALENDAR

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags